
- క్లినిక్ లోని వైద్య సహాయకురాలి పై అఘాయిత్యం..
- యువతి నిలదీయడంతో మోసపూరితంగా పెళ్లి..
- యువతిని వదిలేది మొహం చాటేసిన డాక్టర్…
- బాధితురాలి ఫిర్యాదుతో డాక్టర్ని రిమాండ్ కు పంపిన పోలీసులు..
క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సదువుకున్నోడి కంటే ఆడు ఎవడో మేలు అన్నట్లు.. గీ.. డాక్టర్ చదువైతే సదివిండు గానీ.. వాడి ముద్ది మాత్రం గడ్డి తినింది. మెదడు మోకాళ్ళలో ఉంది. అందుకే వాడికి ఆడోళ్ళ వాసనా కావాల్సి వచ్చింది. ఆ దరిద్రపు గొట్టు డాక్టర్ ఓ ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు.
పవిత్రమైన వృత్తిలో ఉంటూ పాటు పని చేసాడు అందుకోసం అక్కడ ఇక్కడ ఎందుకని తాను నడుపుతున్న తన క్లినిక్ లో సహాయకురాలుగా పని చేస్తున్న సాటి స్త్రీ పైనే ఆ డాక్టర్ పాపపు కండ్లు పడ్డాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి. ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
Read More : 60 మంది సిట్టింగులకు నో టికెట్.. కేసీఆర్ కు పీకే షాకింగ్ రిపోర్ట్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలం కేంద్రంలోని ఓ డాక్టర్ ఒక ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు. దానిలో ఓ యువతి ఆ డాక్టర్ కి సహాయకురాలిగా పనిచేస్తోంది. ఆ యువతి పైన కన్నేసిన డాక్టర్ అఘాయిత్యానికి పాల్పడాడు. ఆ యువతి డాక్టర్ పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో యువతిని మోసపూరితంగా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న యువతిని వదిలేసి పరారయ్యాడు.
Read More : శ్రీశైలంలో కన్నడ భక్తుల వీరంగం.. అర్ధరాత్రి విధ్వంసం
మొహం చాటేసి పరారైన డాక్టర్ పై యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. యువతి ఫిర్యాదు మేరకు వికారాబాద్ డిఎస్పి సత్యనారాయణ ఆ డాక్టర్ ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ వెంకటేశం తెలిపారు. ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- కేబినెట్ లోకి తమ్మినేని.. స్పీకర్ గా ధర్మాన?
- కరెంట్ ఛార్జీలపై కూకట్ పల్లిలో బీజేపీ ధర్నా
- కేసీఆర్ పై ఆర్జీవీ బయోపిక్.. రచ్చరచ్చేనా?
- ఎల్బీనగర్ నుంచి బండి సంజయ్ పోటీ!
- తెలంగాణకు ఆరెంజ్ ఎలర్ట్.. ఇండ్లలో ఉంటేనే బెటర్
3 Comments