Telangana

తెలంగాణకు ఆరెంజ్ ఎలర్ట్.. ఇండ్లలో ఉంటేనే బెటర్

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే రికార్డు స్థాయిలో టెంపరేటర్స్ నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రెండు నుండి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధరణం కంటే అధికం కానున్నట్టు వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించిన అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఎండలు తీవ్రం అయిన నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను సిద్దం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా గడిచిన ఇరవైనాలుగు గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ క్రమలోనే ఉత్తర తెలంగాణ జిల్లాలోతోపాటు దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదంటూ సూచించారు. ఎండ నుండి కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు కూడ తీసుకోవాలని చెప్పారు.

ముఖ్యంగా కోవిడ్ బాధితులతో పాటు సామాన్య ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యరంగ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా పెరిగే ఎండల వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించారు. ముఖ్యంగా గతంలో కోవిడ్ భారిన పడిన వారు తగు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోని అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య నిపుణులు సూచించారు.

 

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.