
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాల రాయితీ గడవును పెడిగించారు. ఈ మేరకు హోంమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 31తో ముగియనుండటంతో మరో 15 రోజుల పాటు గడువు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చెలాన్లు క్లియర్ అయ్యాయి. దాదాపు 250 కోట్ల రూపాయలు పెండింగ్ చలాన్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది.
ప్రజల నుంచి వస్తున్న స్పందన, విజ్ఞప్తి మేరకు 15-04-2022 వరకు పెండింగ్ చలానాలపై రాయితీ అవకాశాన్ని పొడిగించామని హోంమంత్రి తెలిపారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరారు.
ఇవి కూడా చదవండి ..
- తెలంగాణకు ఆరెంజ్ ఎలర్ట్.. ఇండ్లలో ఉంటేనే బెటర్
- వాహనదారులకు మరో గుడ్న్యూస్.. చలానాల గడుపు పొడిగింపు
- శ్రీశైలంలో కన్నడ భక్తుల వీరంగం.. అర్ధరాత్రి విధ్వంసం
- ఇద్దరు తప్ప అందరు అవుట్.. జగన్ కొత్త కేబినెట్ లో రోజా?
- సన్రైజర్స్ హైదరాబాద్ అత్యంత చెత్త రికార్డు
- ఫోన్ మాట్లాడుతుండగా షాక్.. యువకుడు మృతి
- చికెన్ వండని భార్య.. భర్త సూసైడ్!