క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఇటువంటి బెదిరింపులు క్రైమ్ మిర్రర్ దినపత్రికకు కొత్తేమీ కాదు
ఉడుత ఊపులకు… తాటాకు చప్పుళ్ళకు క్రైమ్ మిర్రర్ అదిరేది లేదు… బెదిరేది లేదు
అనుమతుల మంజూరీలో హెచ్ఎండిఏ అధికారులు నిబంధనలను పాటించలేదంటే, నిర్మాణ కంపెనీకి వచ్చిన ఇబ్బంది ఏమిటి?
అనిల్ కన్స్ట్రక్షన్ గ్రూప్ ఎక్కడైనా తప్పు చేసిందని క్రైమ్ మిర్రర్ పేర్కొందా?, ఇరిగేషన్ శాఖ అధికారులు బఫర్ జోన్ గా ధ్రువీకరించిన స్థలంలో హెచ్ఎండిఏ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని మాత్రమే ప్రశ్నించాం
ఏ తప్పు చేయకపోతే అనిల్ కన్స్ట్రక్షన్ గ్రూప్ కు ఎందుకు ఉలిక్కిపాటు?!
పోలీసు ఫిర్యాదు చేస్తామంటూ, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బెదిరింపులు ఎందుకు??
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది.