
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : సెల్ ఫోన్ ప్రస్తుతం నిత్యావసరంగా మారింది. మొబెల్ లేకుండా జీవితం గడపలేని పరిస్థితులు వచ్చాయి. అదే సమయంలో సెల్ ఫోన్లతో అనర్ధాలు పెరిగిపోతున్నాయి. కొందరి ప్రాణాలు తీస్తున్నాయి. మొబైల్ ఫోన్లకు చార్జింగ్ పెట్టి మాట్లాడడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నా జనాలు మాట్లాడటం లేదు. చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ప్రమాదాలు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చినా జనం నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఫలితంగా ఉత్తపుణ్యానికి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన భాస్కర్ జ్యోతినాథ్ (20) రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ శంకర్‌పల్లిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విధుల నుంచి వచ్చిన తర్వాత అర్ధరాత్రి వేళ ఫోన్‌కు చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో చేతులు, చెవులు కాలిపోయాయి. వెంటనే స్నేహితులు అతడిని శంకర్‌ప్లలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత చెత్త రికార్డు
- ఫోన్ మాట్లాడుతుండగా షాక్.. యువకుడు మృతి
- ఢిల్లీకి సీఎం కేసీఆర్.. మేటర్ సీరియస్సేనా?
- చికెన్ వండని భార్య.. భర్త సూసైడ్!
- గ్యాంగ్ రేప్ చేసి మర్డర్! వికారాబాద్ బాలిక కేసులో సంచలనాలు..
- గ్యాంగ్ స్టర్ నయీం బినామీలెవరు?
3 Comments