Telangana

గ్యాంగ్ స్టర్ నయీం బినామీలెవరు?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సంచలన స్పష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఐటీ శాఖ రంగంలోకి దిగింది. నయీం ఆస్తులను గుర్తించి సీజ్ చేస్తోంది. సుమారు పది సంవత్సరాల పాటు సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నయిం భూకబ్జాలు, మర్డర్ కేసులతో నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. దీంతో ఆయన ఎన్ కౌంటర్ తర్వాత సుమారు వెయ్యి ఎకరాలు అక్రమంగా భూములు కొల్లగొట్టినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే నయీం ఆస్థులపై ఐటిశాఖ నజర్ పెట్టింది.కొన్ని ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసింది. సమాచారం సేకరించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

తాము సీజ్ చేసిన ఆస్థులకు సంబంధించి ఎలాంటీ ఆధారాలు లభించకపోవడంతో వాటిని పూర్తిగా జప్తు చేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు 150 కోట్ల విలువగల 10 ఆస్థులను జప్తు చేయాలని కీలక అనుమతులు ఇచ్చింది. దీంతో జప్తు చేసిన ఆస్ధులన్ని ఆదాయపు శాఖ ఆధీనంలోకి వెళ్లనున్నాయి.ఇలా ఇప్పటికే 45 ఆస్థులను ఐటిశాఖ ఎలాంటీ కార్యకలాపాలు జరగకుండా సీజ్ చేసింది. ఐటీ శాఖ సీజ్ చేసిన ఆస్తులన్నీ ప్రస్తుతం నయీం బినామీల దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా నయీం బినామీలు కొందరు ఐటీ శాఖకు చిక్కలేదని పోలీసులు భావిస్తున్నారు. వాళ్లను కూడా గుర్తించి ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Read More : మునుగోడుపై పీకే టీమ్ రిపోర్ట్.. కొత్త నేతకే టికెట్?

పది సంవత్సరాల పాటు తన ప్రపంచాన్ని నడిపిన నయిం 2016 షాద్‌నగర్‌లో జరిగిన పోలీసులఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. వందలమంది అమాయకులను బెదిరింపులకు గురి చేయడంతో పాటు అక్రమంగా భూకబ్జాలు చేయడం అలవాటుగా మార్చుకున్న నయీం కోట్ల రూపాయల ఆస్థులను కూడబెట్టారని పోలీసులు విచారణలో తేల్చారు.. దీంతో ఆయన ఆస్థులపై ఐటిశాఖ విచారణ చేపట్టగా తాజాగా ఆ కేసు ఓ కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి ..

  1. గ్యాంగ్ రేప్ చేసి మర్డర్! వికారాబాద్ బాలిక కేసులో సంచలనాలు..
  2. ఎమ్మెల్యే తమ్ముడికి దళిత బంధు.. ఇదేందయా కేసీఆర్!
  3. సభ్య సమాజానికి తలవంపు..! కామపిశాచితండ్రే…కన్న కూతురి పై అత్యాచారం…
  4. యాదాద్రిలో కోమటిరెడ్డికి అవమానం?
  5. యూపీలో బీజేపీకి బీఎస్పీ సాయం… రాష్ట్రపతిగా మాయావతి ?

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.