
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిధి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులతో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాత్రం అవమానం జరిగింది. స్థానిక ఎంపీగా ఉన్న కోమటిరెడ్డికి ఆలయ పున్ ప్రారంభ వేడుకలు ఆహ్వానం రాలేదు. తనను పిలవకపోవడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More : సీఎం నితీశ్ కుమార్ పై దాడి.. బీహార్ లో కలకలం
యాదాద్రి పునఃప్రారంభం విషయంలో తెలంగాణ సీఎంవో ప్రొటోకాల్ పాటించలేదని కోమటిరెడ్డి మండడిపడ్డారు. స్థానిక ఎంపీగా తనను పునఃప్రారంభానికి పిలవపోవడం దారుణమన్నారు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రం ఆహ్వానించారని విమర్శించారు. దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ట్వీట్ చేశారు.
యాదాద్రి పునఃప్రారంభానికి @TelanganaCMO ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా నన్ను పునః ప్రారంభానికి పిలవలేదు.
కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను మాత్రం ఆహ్వానించింది.
దేవుడు దగ్గర కేసిఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 28, 2022
ఇవి కూడా చదవండి ..
- యూపీలో బీజేపీకి బీఎస్పీ సాయం… రాష్ట్రపతిగా మాయావతి ?
- మునుగోడుపై పీకే టీమ్ రిపోర్ట్.. కొత్త నేతకే టికెట్?
- వాళ్లకు టికెట్లు ఇస్తే గోవిందా… కేసీఆర్ కు పీకే టీమ్ రిపోర్ట్!
- ఎంపీ అర్వింద్ కు కవిత దిమ్మతిరిగే షాక్. .
- చినజీయర్ పై కసి తీర్చుకున్న కేసీఆర్!