TelanganaWarangal

ఉద్యోగ భర్తీ ప్రకటనపై నేతల హర్షం.. సీఎంకు కృతజ్ఞతలు

క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: ఉద్యోగ ప్రధాత సీఎం కేసీఆర్‌ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఉద్యోగ ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల పరిపూర్ణం అయ్యిందన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు కల నెరవేరిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రజల కల సాకారమైందన్నారు.

ad 728x120 SRI copy - Crime Mirror

ఉద్యమంలో విద్యార్థులు, యువత పాత్ర కీలకమైందన్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిన సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్పపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

  1. ఖుష్ మహల్ వద్ద ఖుషీ ఖుషీగా మహిళా దినోత్సవ వేడుకలు
  2. నా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి సీఎంను చూడలేదు- మంత్రి ఎర్రబెల్లి
  3. సహకార స్వాహా పై చైర్మన్ ప్రెస్ మీట్.. సమాచార హక్కు చట్టాన్ని కాలరాసే ప్రయత్నం

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.