MahabubabadTelanganaWarangal

ధరణి కష్టాలు కేసీఆర్ పాపమే- మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

  • ధరణితో తెలంగాణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
  • ధరణి సవరణలు చేయించేందుకు ఏడాదిన్నరగా తిప్పలు
  • తమ భూమి అమ్ముకోలేక కొందరు
  • రైతుబంధు, రైతు బీమా అందక మరికొందరి అవస్థలు
  • దరఖాస్తులన్నీ కలెక్టర్ల దగ్గర పెండింగ్
  • రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు
  • రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో అప్లికేషన్లు పెండింగ్

క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: ధరణి పేరిట రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూన్నా సీఎం కేసీఆర్ కు ప్రజలు గట్టిబుద్దిచెప్పాలని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సి, ఎస్టీలకు అసైన్డ్ భూములను ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో తిరిగి లాక్కున్నారని మండి పడ్డారు. ప్రతి గ్రామంలో ధరణి వల్ల అనేకమంది పోలీసులు, కలెక్టర్లు, కోర్టులచూట్టు తిరుగున్నారని అన్నారు.

హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో తాజాగా జరిగిన రియల్టర్ల హత్యలు ధరణి వల్లే జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలో ధరణి పోర్టల్ తో ప్రజల భూములను దొచుకుంటున్నారని అన్నారు. రియల్టర్ల హత్యలు ధరణి పోర్టల్ వల్లే జరిగాయని, ఇంకా ఇలాంటి దారుణాలు ఇంకెన్ని జరుగుతాయోనని అన్నారు. ధరణితో సిటీ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములను కేసీఆర్ బంధువులు ఆక్రమించుకున్నారని, ఇందాంత దోచుకునే మూఠాలా ఉందన్నారు. విఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత గ్రామాల్లో సామాన్య రైతులకు భూ సమస్యలపై కనీస సమాచారం చెప్పే నాథుడు లేకుండా పోయారని అన్నారు.

Read More : శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర నిజమేనా? అసలు నిజాలు ఇవేనా?

ప్రాథమిక సమాచారం కొరకు కూడ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతాంగం, గ్రామ స్థాయిలో విఆర్వోలు ఉండి ఉంటే ఆధార్ నెంబర్ లేని రైతుల వివరాలు గుర్తించి అప్ డేట్ చేయడం, విస్తీర్ణం ఎక్కువ, తక్కువ ఉన్న రైతులను గుర్తించి త్వరితగతిన మిగతా రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వడానికి అవకాశం ఉండేదన్నారు. ఇక రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పట్టా భూములు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉన్నాయన్నారు. పట్టా భూములను కూడా ప్రభుత్వ భూములుగా, రెవెన్యూ ల్యాండ్స్ ను ఫారెస్ట్ , ఎండోమెంట్, వక్ఫ్ ల్యాండ్స్ గా మార్చడంతో నిషేధిత జాబితాలోకి వెళ్లాయన్నారు.

మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్లకు ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా ఇదే జాబితాలో ఉన్నాయన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, సంగారెడ్డి జిల్లాల్లో పోడు భూములకు హక్కులు కోరుతూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, దాదాపు రెండున్నర లక్షల మంది 6.50 లక్షల ఎకరాలకు అప్లికేషన్ పెట్టుకున్నా గిరిజనులకు ఆ భూములకు పట్టాలు ఇచ్చేందుకు అనుసరించాల్సిన గైడ్ లైన్స్ ను ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదని విమర్శించారు.

తక్షణమే రెవెన్యూ పరిపాలనలో కీలకమైన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించాలని, భూ పరిపాలన ప్రధాన కమీషనర్ ను నియమించి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, భూ సమస్యలు పరిష్కరించే తీరుపై కింది స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలిస్తూ నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. విఆర్వోలకు మార్పులు చేర్పులు అధికారం కాకుండా ప్రాథమిక విచారణ బాధ్యతలు అప్పగించి తహశీల్దార్లకు రెవెన్యూ పరిపాలనలో సహాయకారిగా ఉండేలా చూడాలన్నారు. డిజిటల్ సర్వే చేసి ప్రతి సర్వే నెంబర్ కి డిజిటల్ మ్యాపులు తయారు చేయాలని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి ..

  1. కోడికూర వండలేదని చెల్లెను చంపేసిన అన్న!
  2. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం..
  3. నాలుగు రోజుల్లో 60 లక్షల చలానాలు క్లియర్..
  4. కాంగ్రెస్ కు 40 లక్షల ఏకే 47లు?
  5. సహకార లీలలు..! – విధులు గాలికి… నిధులు జేబుకి

ad 728x120 HUMA copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.