
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : సంచలన వ్యాఖ్యలతో కాక రాజేసే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకు 47 లక్షల ఏకే 47లు ఉన్నాయన్నారు. తెలంగాణలో కేసీఆర్ పని ఖతమైందని, హస్తం పార్టీకి అధికారం ఖాయమని చెప్పారు.తెలంగాణలో నలభై లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి టీ.కాంగ్రెస్ దేశంలో నెంబర్ వన్‌గా నిలబడిందని రేవంత్ రెడ్డి అన్నారు..అయితే వాటిని 50 లక్షల వరకు ఈ సభ్యత్వాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుత సభ్యత్వాలకు తోడు రాబోయే ఎన్నికల్లో 80 లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్ గెలుపు సునాయాసమవుతుందని అన్నారు.
Read More : అమ్మో ఆర్టీసీ దొంగ..!! – రూ. 40 వేల విలువైన వస్తువుల చోరీ…!!
టీఆర్ఎస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు పీకే ఉంటే కాంగ్రెస్‌లో 40 లక్షల మంది ఏకే 47 లాంటి వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇదే ఉదహారణ అని చెప్పారు.. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని అయితే.. పార్టీ నాయకులు అందిపుచ్చుకునేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.. సభ్యత్వంలో బలంగా పని చేసిన వారికే టికెట్ అవకాశాలు ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు.. ఎలాంటి పైరవీ లేకుండా వాళ్లకు టికెట్ ఇచ్చే హామీ నాది అన్నారు… పని చేయని వారికి టికెట్‌తో పాటు ఎలాంటి పదవి రాకుండా నేను అడ్డుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
ప్రతి బూత్ నుంచి వంద సభ్యత్వం ఉంటేనే ఆ నియోజవర్గంలో పీసీసీ మెంబర్ ఉంటుంది. వంద సభ్యత్వం లేకుండా ఎంత పెద్ద నాయకుడు ఉన్నా పీసీసీ సభ్యత్వం ఇవ్వమని చెప్పారు.. టికెట్ల ఎంపికలో ఢిల్లీ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారని, కాబట్టి టికెట్ ఆశించిన వారు జాగ్రత్తగా పనిచేయాలని అన్నారు.రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ సభ్యత్వం ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.. పార్టీ సమావేశానికి రాని వారిని, లైట్‌గా తీసుకున్న వారిని పదవుల ఎంపికలో అవకాశాలు కల్పించమని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి …
- నాలుగు రోజుల్లో 60 లక్షల చలానాలు క్లియర్..
- సహకార లీలలు..! – విధులు గాలికి… నిధులు జేబుకి
- శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర నిజమేనా? అసలు నిజాలు ఇవేనా?
- ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో ఆరుగురి అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు..
- రావిర్యాల లో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
One Comment