Andhra PradeshTelangana

సమతా క్షేత్రానికి విపక్షాలకు ఆహ్వానం ఉండదా!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ముచ్చింతల్ శ్రీ రామానుజాచార్యుల సమతా క్షేత్రంలో శనివారం శాంతి కల్యాణం నిర్వహిస్తున్నారు. శ్రీ రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతానికి స‌హ‌క‌రించిన అందరినీ చిన‌జీయ‌ర్ స్వామి అభినందించారు. చివ‌రి ఘ‌ట్టం శాంతి క‌ల్యాణానికి అంద‌రూ ఆహ్వానితులే అన్నారు. నిజానికి సమతా మూర్తి క్షేత్రంలో శాంతి కల్యాణం ఈనెల 14నే జరగాల్సి ఉంది. కాని చినజీయర్ వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారన్నది ఎవరికీ అర్ధం కాలేదు. శాంతి కల్యాణం వాయిదాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

చిన‌జీయ‌ర్‌తో కేసీఆర్‌కు బాగా చెడింద‌ని ప్రచారం జరుగుతోంది. ప్ర‌ధాని మోదీ సంద‌ర్శ‌న స‌మ‌యంలో ఆయ‌న‌తో విభేదాల కార‌ణంగా ఆ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ డుమ్మా కొట్టారు. మోదీని చిన‌జీయ‌ర్ అంత‌లా పొగ‌డ‌టం.. క‌నీసం శిలాఫ‌ల‌కంపై త‌న పేరు కూడా వేయ‌క‌పోవ‌డం.. కేసీఆర్‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించిందని అంటున్నారు. అందుకే ఆయన ముచ్చింత‌ల్ వైపు క‌న్నెత్తి చూడలేదంటున్నారు. శిలాఫ‌ల‌కాన్ని అప్ప‌టిక‌ప్పుడు మార్చేసి.. కేసీఆర్ పేరు చెక్కించినా.. ఆయ‌న అల‌క వీడ‌లేదట. పూర్ణాహుతికి వెళ్ల‌లేదుచిన‌జీయ‌ర్‌, మైహోం రామేశ్వ‌ర్‌రావులు కూల్ చేయాలని చూసినా కేసీఆర్ క‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ కు న‌చ్చ‌చెప్పేందుకే ఎప్పుడో జ‌ర‌గాల్సిన శాంతి క‌ల్యాణాన్ని సైతం శుక్ర‌వారానికి వాయిదా వేశార‌ని అంటున్నారు.

అందుకే మీడియా సమావేశంలో కేసీఆర్ విభేదాలపై చినజీయర్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలు, స్వపక్షాలు, ప్రభుత్వాలు.. ఇలా మాకు భేదాలు ఉండవు. ప్రజా సేవలో ఉండే ప్రతి ఒక్కరికి సమతాస్ఫూర్తి ఉండాలి. మేం ప్రతి ఒక్కరినీ పిలిచాం. ప్రతిపక్షాలు కేవలం రాజకీయాల్లోనే ఉంటాయి.. భగవంతుడి వద్ద కాదు. దేవుడికి పూజ, యాగం వంటివి జరిగే చోట ఎలాంటి ఆహ్వానం అక్కర్లేదు.. అని స్వామిజీ సెల‌విచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన పూర్తి సహకారం అందించారని చెప్పారు.. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే మొదటి వాలంటీర్‌ని అని చెప్పారు. ఆరోగ్యం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల దృష్ట్యా ఆయన రాలేకపోయి ఉంటారు. సీఎం కేసీఆర్‌ని కూడా శాంతి కల్యాణానికి ఆహ్వానిస్తున్నాం.. అన్నారు చిన‌జీయ‌ర్ స్వామి.

సహస్రాబ్ది ఉత్సవాలకు ప్ర‌తిప‌క్షాల‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపైనా స్పందించారు చినజీయర్ స్వామి. రాజకీయాల్లోనే ప్రతిపక్షాలుంటాయి.. భగవంతుడి ద‌గ్గ‌ర‌ కాదన్నారు చినజీయర్‌ స్వామి. దేవుడికి పూజ, యాగం వంటివి జరిగే చోట ఎలాంటి ఆహ్వానం అక్కర్లేదన్నారు. అయితే ఆ ఆహ్వానం కేవ‌లం ప్ర‌తిప‌క్షాల‌కు మాత్ర‌మే అక్క‌ర్లేదా? మీకు కావ‌ల‌సిన, మీరు రావాల‌నుకున్న వారంద‌రి గ‌డ‌ప‌లు తొక్కి మ‌రీ స్వ‌యంగా ఆహ్వానించారుగా.. అని గుర్తు చేస్తున్నారు విమ‌ర్శ‌కులు. పీఎం మోదీ నుంచి ప‌లు రాష్ట్రాల సీఎంల వ‌ర‌కూ.. చిన‌జీయ‌రే ప్ర‌త్యేకంగా ఇన్‌వైట్ చేశారు. ఇక‌, ముచ్చింత‌ల్ వ‌చ్చిన ఆ అధికార‌ ప్ర‌ముఖులంద‌రినీ తెగ పొగిడేశారు. మోదీనైతే ఏకంగా శ్రీరామునితో పోల్చేశారు. క‌శ్మీర్ అంశాన్నీ ప్ర‌స్తావిస్తూ హీరోగా కీర్తించారు. అమిత్‌షానూ ఆకాశానికెత్తేశారు.సీఎం జ‌గ‌న్‌కూ భ‌జ‌న చేసేశారు. కేసీఆర్ రాకున్నా.. అసంద‌ర్భంగా క‌ల్పించుకొని మ‌రీ ప్ర‌శంసించేశారు.

రామానుజుల స‌హ‌స్రాబ్ది స‌మారోహ‌ణ కార్య‌క్ర‌మానికి అతిథిగా హాజ‌రు కావాలంటే అధికారంలో ఉన్న‌వారే అర్హులా? ప్ర‌తిప‌క్షాల‌కు స్వామీజీ త‌ర‌ఫున ఎలాంటి ఆహ్వానం ఉండ‌దా? అనే విమ‌ర్శ‌లు వస్తున్నాయి. స‌మ‌తాస్పూర్తి అని చెబుతూనే.. ఆ స‌మ‌తాస్పూర్తికే తూట్లు పొడిచేలా ప్ర‌వ‌ర్తించార‌నే ప్ర‌చారం జ‌రిగింది. విప‌క్షాల నుంచి ఏ ఒక్క నాయ‌కుడికీ ఆ రామానుజుల చెంత స్థానం ల‌భించ‌లేదు..క‌ల్పించ‌లేదు. కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అధికార ప‌క్షానికి మాత్ర‌మే అత్యంత ప్రాధాన్యం క‌ల్పించారు. బీజేపీ డామినేష‌న్ స్ప‌ష్టంగా క‌నిపించిందనే ఆరోప‌ణ ఉంది. రాహుల్‌గాంధీని కానీ, రేవంత్‌రెడ్డిని కానీ.. క‌నీసం చంద్ర‌బాబునాయుడుకి సైతం రామానుజుల కార్య‌క్ర‌మంలో స్థానం లేకుండా చేశారు ఇదేదో అంద‌రి కార్య‌క్ర‌మం కాకుండా.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లా నిర్వ‌హించార‌ని అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

  1. మేడారం  జాతరలో అధికారుల ప‌ని తీరు భేష్
  2. మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులు
  3. ఉచిత అంబులెన్స్ సర్వీస్ వాహనాలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు
  4. సమతా క్షేత్రానికి విపక్షాలకు ఆహ్వానం ఉండదా!
  5. మోహన్ బాబుకు ఘోర అవమానం!
  6. వైసీపీలో జిల్లాల సెగ.. ఆనం, రోజా రచ్చరచ్చ!

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.