Telangana

జిన్నా టవర్ కు జాతీయ రంగులు.. వివాదం ముగిసినట్టేనా?

క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రచ్చ రాజేసిన గుంటూరు జిన్నా టవర్ వివాదానికి చెక్ పెట్టేలా కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యాతక అంశాన్ని అంతే సున్నితంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంది. జిన్నా టవర్ పేరును మార్చడం లేదా దాన్ని కూల్చేయాలంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేస్తోన్న డిమాండ్ చేస్తుండగా.. ఈ రెండూ కాకుండా మధ్యేమార్గాన్ని ఎంచుకుంది కార్పొరేషన్. జిన్నా టవర్‌కు నగరపాలక సంస్థ అధికారులు జాతీయ జెండా రంగులు వేయించారు.

జిన్నా టవర్ పేరు మార్చాలంటూ కొన్నాళ్లుగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి జాతీయ నాయకుల పేరును పెట్టాలంటూ ఆందోళనలు చేసింది.
టవర్ పేరు మార్చకుంటే కూలుస్తామని హెచ్చరించారు కమలం నేతలు. దేశవిభజనకు కారకుడైన మహ్మద్ అలీ జిన్నా పేరును మనదేశంలోని స్థూపానికి ఎలా పెడతారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రభుత్వం పేరు మార్చకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జిన్నా పేరు తొలగిస్తామని స్పష్టం చేశారు.

Read More : నీకో దండం జగన్.. కడప జిల్లాలో పోస్టర్ల కలకలం.. – Crime Mirror

బీజేపీ ఆందోళనల నేపథ్యంలో జిన్నా టవర్ అంశంపై గుంటూరు మేయర్.. మతపెద్దలతో ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరపాలక కమిషనర్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించాలని ముక్తకంఠంతో తీర్మానించారు., జిన్నా టవర్ పేరు మార్చే ప్రసక్తేలేదని మేయర్ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల వంటి ప్రత్యేక సందర్భాల్లో త్రివర్ణ పతకానికి ఎగురవేయడానికి వీలుగా జిన్నా టవర్ పక్కనే ఓ భారీ స్తంభాన్ని కూడా నిర్మిస్తామని చెప్పారు.

Siddipet : సిద్దిపేటలో కాల్పులు.. 43 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు – Crime Mirror

గుంటూరులో ముఖ్యమైన కూడలిగా వెలుగొందుతున్న కట్టడం జిన్నా టవర్‌. శాంతిచిహ్నంగా కుతుబ్‌మినార్ తరహాలో ఈ టవర్‌ను 1942లో నిర్మాణం చేపట్టి 1945లో పూర్తి చేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మహ్మద్‌ అలీ జిన్నాను స్థానికులు ఆహ్వానించారు. అనివార్య కారణాలతో ఆయన హాజరుకాలేదు. తన ప్రతినిధిగా జుదాలియాఖత్ అలీఖాన్‌ను పంపారు. అప్పటి నుంచి జిన్నా టవర్‌గా ఈ కట్టడానికి పేరొచ్చింది.

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ రచ్చ!
  2. కేసీఆర్ బూతు పురాణం ఎందుకు? ఆయన అసలు టార్గెట్ ఏంటీ ?
  3. ఆ ప్రాంతాల నుంచే గంజాయి రవాణా పెరిగింది : ఎస్పీ సునీల్ దత్
  4. లక్షల కోట్లు ముంచినవాళ్లకు రాయితీలా.. సిగ్గు లేదా మోడీ!

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.