Telangana

మినిస్టిర్ సార్ .. నా ఆత్మహత్యకు అనుమతినివ్వండి ..

  • మంత్రి కేటిఆర్ కు నల్గొండ యువ రైతు లేఖ ..
  • ఆత్మహత్యకు అనుమతినివ్వాలని కోరిన రైతు
  • పల్లె ప్రకృతి వనం పేరిట భూమిని లాక్కున్నారని ఆవేదన

క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : బీటెక్ చదివిన తాను వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని.. పల్లె ప్రకృతి వనం పేరుతో ఆ భూమిని అధికారులు తీసుకున్నారని ఆ యువ రైతు లేఖలో వాపోయాడు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు తన ఆత్మహత్యకు అనుమతినివ్వాలంటూ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాడు. తనకున్న కొద్దిపాటి భూమిని పల్లె ప్రకృతి వనం పేరిట అధికారులు స్వాధీనం చేసుకున్నారని లేఖలో వాపోయాడు. ఉన్న జీవనాధారాన్ని కోల్పోవడంతో ఇక తనకు చావే శరణ్యమని… తాను చనిపోయేందుకు అనుమతినివ్వాలని మంత్రిని కోరాడు. జిల్లాలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే రైతు ఈ లేఖ రాశాడు.

Read More : తెలంగాణ కాబోయే సీఎం రేవంతే! కాంగ్రెస్ లో జోష్ నింపిన సర్వే…

బీటెక్ చదివిన తాను వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని శ్రీను లేఖలో పేర్కొన్నాడు. తనకు ఎలాంటి ఉద్యోగం లేదని పేర్కొన్నాడు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే తాను ఉన్న భూమిని పల్లె ప్రకృతి వనం పేరుతో అధికారులు తీసుకోవడంతో రోడ్డున పడ్డానని తెలిపాడు. గతంలో కొంత భూమిని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కోసం అధికారులు తీసుకున్నారని పేర్కొన్నాడు.  తన జీవితం దుర్భరంగా మారిందని.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. తన సమస్యను కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చొప్పరి శ్రీను మంత్రి కేటీఆర్‌కు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, హరిత హారం పేరిట గ్రామాల్లోని పేదల భూములను లాక్కుందనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భూములు కోల్పోయినవారు కలెక్టరేట్ల ఎదుట నిరసనకు దిగుతున్నారు. తమ భూములను తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాక కొన్ని కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. పట్టా భూములు కొన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చబడ్డాయి. కొన్ని పట్టా భూములు అసలు అసలు పోర్టల్‌లో చేర్చనే లేదు. దీంతో ఆ భూముల రైతులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు బంధు, రైతు భీమా అందక.. అవసరానికి భూములు అమ్ముకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ భూములను ధరణి పోర్టల్‌లో చేర్చాలని నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ఇవి కూడా చదవండి ..

  1. అక్రమ రిజిస్టేషన్ల పై ఏసిబి విచారణ చేయాలి… ఎంపిపి మెండు, జెడ్పిటిసి పాశం
  2. మద్యం మత్తులో కారు డ్రైవర్ భీభత్సం… బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన కారు..
  3. రియల్‌ బ్రోకర్లుగా ఆ తహసీల్దార్లు.. సోషల్‌ మీడియాలో చక్కర్లు…
  4. పెరుగుతున్న పాజిటీవ్ కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.