
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అతనో పెద్ద వ్యాపారవేత్త. తెలుగు రాష్ట్రాల్లో బడా కాంట్రాక్టర్. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తుంటాడు. పేరు నిరంజన్ కుమార్ జైన్. ఉండేది హైదరాబాద్‌లోనే. ఇతగాడి ఆస్థి ఇంచుమించి వెయ్యి కోట్లు. బిజినెస్ సర్కిల్స్‌లో, పార్టీల్లో డ్రగ్స్ అలవాటు అయింది. ఆ తర్వాత వాటికి బానిసయ్యాడు. అలా.. అప్పుడప్పుడూ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకుంటూ వస్తున్నాడు. ఫేమస్ డ్రగ్ పెడ్లర్ టోనీ నుంచి దాదాపు 30సార్లు డ్రగ్స్ కొనుగోలు చేశాడు. లేటెస్ట్గా ఆ టోనీని పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆ వ్యాపారవేత్త నిరంజన్ కుమార్ జైన్ పేరు సైతం బయటకు వచ్చింది. అతన్నీ అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
నిరంజన్ కుమార్ జైన్ ఒక్కడే కాదు.. అలాంటి సంపన్నులు ఇంకా చాలామందే డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. టోనీతో లావాదేవీలు నడిపిన 13మంది జాబితా ఖాకీలకు చిక్కింది. అందులో 9మందిని అరెస్ట్ చేశారు. శాశ్వత్ జైన్ (కన్స్ట్రక్షన్ ఫీల్డ్), యగ్యానంద్ (స్పైసెస్ బిజినెస్), సూర్య సుమంత్ రెడ్డి, బండి బార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేడి సాగర్, ప్రైవేట్ జాబ్ చేసే అల్గాని శ్రీకాంత్, ఆఫీస్ బాయ్ బాడి సుబ్బారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఆర్థికంగా బాగా సెటిల్ అయినవారే కావడం విశేషం. అంత సంపాదించి.. మత్తు పదార్థాలకు బానిసై.. ఇప్పుడిలా కటకటాల పాలు కావడం దారుణం. వెయ్యి కోట్ల ఆస్థి ఉన్నా ఏం లాభం? ఇప్పుడు జైల్లో చిప్ప కూడు తినాల్సిన దుస్థితి. సొసైటీలో ఉన్న పరువంతా పోయి.. డ్రగ్గిస్ట్ అనే ముద్ర.
హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకంపై నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నారా? అనే ప్రశ్నకు.. ఇకపై వాళ్లకు మినహాయింపు ఉండదన్నారు. సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో పట్టుబడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. నగరంలో డ్రగ్స్ వాడకమనేది ఇంటింటి సమస్యగా మారుతోందన్నారు. డ్రగ్స్ వాడే వాళ్లను కట్టడి చేయనంత కాలం.. దీన్ని అరికట్టలేమని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంపై సీఎం, ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నారని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
ఇవి కూడా చదవదండి ..
- తెలంగాణ కాబోయే సీఎం రేవంతే! కాంగ్రెస్ లో జోష్ నింపిన సర్వే…
- భర్తను నరికి.. తలతో పీఎస్‌కు మహిళ.. చిత్తూరు జిల్లాలో కిరాతకం
- శబరిమలలో పేలుడు పదార్ధాలు కలకలం ..
- రియల్ భూ బకాసురుల నుండి పార్క్ లను కాపాడండి
2 Comments