
క్రైమ్ మిర్రర్, హయత్ నగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హయత్ నగర్ డివిజన్ బంజా రాకాలనీలో ఉన్న పార్కు స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జా నుంచి కాపాడాలని బంజారా కాలనీ వాసులు జిహెచ్ఎంసి అధికారులను కోరారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పందించి కబ్జారాయుళ్ల నుంచి తక్షణమే పార్కు స్థలాన్ని కాపాడి స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా అంగ న్వాడీ సెంటర్లు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంజరాకాలనీ వాసులు మెగావత్ గోవర్ధన్నాయక్, బల్రాంనాయక్, కరంటోతు శంకర్ నాయక్, అంజమ్మ, జాంజ్యానాయక్, బాలు, పంతు నాయక్, గాసీరాం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- ప్రగతి భవన్ దగ్గర జేసీ హల్చల్.. ఎందుకో తెలుసా?
- కొవిడ్ కావాలా.. అయితే మా ఇంటికి రండి! వైసీపీ ఎమ్మెల్యే ఆఫర్..
- లక్ష్మిపార్వతి.. ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడిందట!
- వీడిన మొండెం లేని తల మిస్టరీ – Crime Mirror
One Comment