Telangana

12 ఏళ్ల లోపు చిన్నారులకు ఫ్రీ! త్వరలో ఆర్టీసీ బంపర్ ఆఫర్..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నూతన సంవత్సరంలో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా తెలంగాణ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతోంది. టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని జనవరి 1 నాడు 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర అంశం వెల్లడించారు. తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచిత ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Read More : మిడ్ నైట్ వరకు వైన్స్ ఓపెన్.. ఒమిక్రాన్ పెరుగుతున్నా పట్టని సర్కార్

హైదరాబాద్ బస్ భవన్ లో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో పాటు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నారులకు శాశ్వత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కుతారని వివరించారు. తద్వారా ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్ ఆక్యుపెన్సీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్టీసీ అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 12 ఏళ్ల లోపు పిల్లలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ చేసే అవకాశం కల్పించాలని దాదాపుగా నిర్ణయం జరిగిపోయిందని, రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన వస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

  1. పిల్లల వ్యాక్సినేషన్ కు సర్వం సిద్ధం: డా ప్రమోద్ కుమార్
  2. కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న దూదిమెట్ల బాలరాజ్ యాదవ్
  3. తెలంగాణలో థర్డ్ వేవ్ వచ్చేసింది.. రోజూ వేలల్లో కేసులు రావొచ్చు!
  4. తాగి వాహనం నడిపితే ఆరు నెలల జైలు శిక్ష.. న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల రూల్స్

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.