Telangana

ఫాంహౌస్ లో యువకుడి మృతిపై కేసిఆర్ నిజాలు నిగ్గు తేల్చాల్సిందే..

  • ఆంజనేయులు నీటిలో మునిగి 5 నిముషాలు ఉండగలడు
  • చావు ఖర్చులకు పైసలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటు
  • అతడి కుటుంబాన్ని ప్రభుత్వం అడుకోవాల్సిందే..
  • మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ డిమాండ్ చేశారు

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కేసీఆర్ పాంహౌస్ లో యువకుడి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సిద్దిపేట జిల్లాలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఆంజనేయులు కుటుంబాన్ని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు ఐదు నిమిషాల పాటు నీటిలో మునిగి ఉండగలడని ఈటల అన్నారు. ఆంజనేయులు ఎలా చనిపోయాడో నిగ్గు తేల్చి, ఆర్థికంగా అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈటల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Read More : కొనసాగుతున్న భూనిర్వాసితుల ఆందోళన – Crime Mirror

ఆ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం ఆయన అందజేశారు. ఇప్పుడు పోలీసులను మోహరించి ఆంజనేయులు కుటుంబాన్ని బెదిరించవచ్చేమో.. కానీ దీనిపై తెలంగాణ సమాజం ఎలా స్పందిచాలో.. అలాగే స్పందించి తగిన గుణపాఠం చెబుతుందన్నారు. తమ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే లాభం జరుగుతుందని, స్వేచ్ఛ, రక్షణ ఉంటుందని భావించిన ప్రజలకు ఈ చర్య వారి కళ్లు తెరిపించిందని ఈటల వ్యాఖ్యానించారు.. సీఎం ఫాంహౌస్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ, లాభం దేవుడెరుగు కానీ వీళ్లను పెడుతున్న హింస అంత ఇంత కాదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anandaiah : ఒమిక్రాన్ కు ఆనందయ్య బూస్టర్ డోస్! – Crime Mirror

గతంలో పోలీసుల నిర్బాంధాన్ని చవి చూడని ఈ ప్రాంతం ఇప్పుడు నిత్యం పోలీసులు దౌర్జన్యాన్ని చూడాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. కేవలం చావు ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.50 వేల ఇచ్చి చేతులు దులుపుకోవడం సిగ్గు చేటని ఈటల ఫైర్ అయ్యారు.. ఇప్పటికైనా ప్రభుత్వం ఆంజనేయులు కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి ..

  1. అభివృద్ధి పధంలో తుక్కుగూడ మున్సిపాలిటీ
  2. హెల్త్ వర్కర్లు, 60 ఏళ్లవారికి మూడో డోస్.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ స్పీచ్
  3. భవిష్యత్‌ తరాలకు వాజ్‌పేయీ దిక్సూచి…!!
  4. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులంతా పాస్‌..

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.