Andhra PradeshTelangana

ఏపీలో తక్కువ.. తెలంగాణలో ఎక్కువ! సినిమా టికెట్ ధరలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. ఏపీలోని జగన్ ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా..తెలంగాణ సర్కార్ మాత్రం ధరలు పెంచడానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల టిక్కెట్ల ధరలను అధికారికంగా ప్రకటించింది.

ఏపీలో సినిమా టికెట్ ధరల జాబితా..

మున్సిపల్ కార్పొరేషన్లు..

మల్టీప్లెక్సు: ప్రీమియం రూ.250, డీలక్స్: రూ.150, ఎకానమీ: రూ.75
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఏకనమీ రూ.20

మున్సిపాలిటీలు..
మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ: ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30 , ఎకానమీ రూ.15

నగర పంచాయతీలు..
మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ: ప్రీమియం రూ.25, డీలక్స్ రూ. 15, ఏకనమీ రూ.10

గ్రామ పంచాయతీలు..
మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ: ప్రీమియం రూ.15, డీలక్స్ రూ. 10, ఏకనమీ రూ.5

తెలంగాణలో టిక్కెట్ల ధరలు

నాన్ ఏసీ ధియేటర్లలో కనీస టిక్కెట్ ధర రూ.30, గరిష్ఠ ధర రూ.70
ఏసీ ధియేటర్లలో కనీస ధర రూ.50, గరిష్ఠ ధర రూ.150
మల్టీప్లెక్స్‌లో కనీస ధర రూ.100, గరిష్ఠ ధర రూ.250
మల్టీప్లెక్స్ రిక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా రూ.300
(జీఎస్టీ , నిర్వహణ ఛార్జీలు అదనం)

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.