Andhra PradeshTelangana

టీఆర్ఎస్ తో పొత్తుకు సీనియర్ల స్కెచ్! కాంగ్రెస్ కు గుడ్ బై యోచనలో రేవంత్?

తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనాలు జరగబోతున్నాయా? ఆంధ్ర నేతల పెత్తనం పీసీసీలో ఎక్కువైందా? అంటే గాంధీభవన్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత పార్టీ గాడిలో పడిందని అంతా అనుకున్నారు. వరుస కార్యక్రమాలతో రేవంత్ దూకుడు పెంచడంతో కేడర్ లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని భావిస్తున్న సమయంలో కొత్త కుట్రలు బయటికి వచ్చాయని అంటున్నారు. కేసీఆర్ కు కోవర్డులుగా ఉంటున్న కొందరు కాంగ్రెస్ నేతలు.. రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెద్ద ఎత్తున మంత్రాంగం జరుపుతున్నారని తెలుస్తోంది.

Read More : కేంద్రంపై చావు డప్పు సరే.. కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కదా? – Crime Mirror

రేవంత్ రెడ్డి జోరు కాంగ్రెస్ పార్టీలో మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. దారిలోకి వచ్చారనుకున్న సీనియర్లు రోజుకొకరు నేరుగా రేవంత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబుకు కోవర్ట్ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళితే నాశనమేనంటున్నారు. హుజూరాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిన తర్వాత ఈ దాడి మరింత తీవ్రమైంది. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, వీహెచ్, ఉత్తమ్, దామోదర, మధు యాష్కీ, భట్టి.. ఇలా సీనియర్ నేతలందరూ రేవంత్‌తో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. డీసీసీలను మారుస్తారన్న వార్తల నేపథ్యంలో జిల్లాస్థాయి నేతలు కూడా అసమ్మతి స్వరమే అందుకున్నారు. అన్ని జిల్లాల్లో జరగాల్సిన నిరుద్యోగ జంగ్ సైరన్ సభల అతీగతీ లేకుండాపోయింది. ఆందోళనలు, ఉద్యమాలకు బ్రేక్ పడింది. ఇతర పార్టీల నుంచి రావాల్సిన ఛోటా బడా నేతలు ఆగిపోయారు.

Read More : ఇంటర్ విద్యార్థులంతా పాస్! – Crime Mirror

ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తున్నదే తప్ప రంగంలోకి దిగడం లేదు. డబ్బులు తీసుకుని రేవంత్ నియామకానికి సహకరించారని స్వయానా తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌పై ఆరోపణలు చేసిన వారిని కూడా పట్టించుకున్న నాథుడు లేడు. దీంతో కేంద్రంలో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒంటరిగానే మిగిలిపోయారని అంటున్నారు. కే సీ వేణుగోపాల్, కొప్పుల రాజు వంటి ఢిల్లీ నేతలు కూడా రేవంత్ వ్యతిరేకులకు ఊతమిస్తున్నారని సమాచారం. ఆ మధ్య హైదరాబాద్ శివార్లలోని ఓ ఫాంహౌజ్‌లో నిర్వహించిన రహస్య సమావేశంలో వైఎస్సార్ ఆత్మగా పేరుబడిన ఓ నేత.. రేవంత్ వ్యతిరేక వర్గీయులను ఏకం చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బీజేపీని ఉమ్మడి శత్రువుగా భావించి కేసీఆర్‌తో సఖ్యంగా ఉండడమే ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్కరమని వీళ్లు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేయబోతున్నారని వినికిడి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునేలా వీళ్లంతా స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు. వైఎస్సార్ ఆత్మగా చెప్పుకునే నేతకు సీఎం కేసీఆర్ తో మంచి సంబంధాలున్నాయని తెలుస్తోంది.

Read More : ఒమిక్రాన్, డెల్టా కలిస్తే సూపర్ వేరియంట్‌! అదే జరిగితే పెను విలయమే? – Crime Mirror

కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలంతా వైఎస్సార్ ఆత్మ కనుసన్నల్లోనే పని చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఎన్నిక కాక రేపింది. ఈ ఎన్నికలో రవీందర్ సింగ్ అధికార పార్టీకి సవాల్ విసిరారు. ఆయనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చాయనే ప్రచారం జరిగింది. హుజురాబాద్ తరహాలోనే కరీంనగర్ లో కారుకు షాక్ తగలనుందనే సీన్ క్రియేట్ అయింది. అయితే కరీంనగర్ లో పోటీలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ నిర్వహించింది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రతినిధులతో క్యాంప్ నిర్వహించారు. రవీందర్ సింగ్ కోసమే ఈ క్యాంప్ పెట్టారని అంతా భావించారు. కాని ఫలితాల తర్వాత అసలు సంగతి బయటపడింది. టీఆర్ఎస్ కు వాళ్లకున్న బలం కంటే దాదాపు వంద ఓట్లు ఎక్కువొచ్చాయి. అవన్ని కాంగ్రెస్ ఓట్లేనని, శ్రీధర్ బాబు నిర్వహించిన క్యాంపులో ఉన్నవారంతా టీఆర్ఎస్ కు ఓటేశారని తెలుస్తోంది.

Read More : తెలంగాణలో 20 ఒమిక్రాన్ కేసులు.. జనవరిలో విలయమే? – Crime Mirror

సీఎం కేసీఆర్ తో వైఎస్ ఆత్మ మిలాఖత్ లో భాగంగానే ఇదంతా జరిగిందని అంటున్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ ఓట్లు రవీందర్ సింగ్ కు పడితే తమకు ఇబ్బంది అవుతుందని గ్రహించిన కేసీఆర్.. కాంగ్రెస్ లోని తన కోవర్టుల ద్వారా ఈ కథ నడిపించారని అంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే సీట్ల కేటాయింపులతో పాటు పదవుల విషయంలోనూ కొందరు కాంగ్రెస్ నేతలకు గులాబీ బాస్ హామీ ఇచ్చారనే చర్చ సాగుతోంది. ఈ విషయాలను గ్రహించడం వల్లే కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి తీవ్ర నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నరని గాంధీ భవన్ వర్గాల సమాచారం. కాంగ్రెస్- టీఆర్ఎస్ పొత్తు కుదిరితే రేవంత్‌రెడ్డికి అశనిపాతమే అవుతుంది. అందుకే ఆయన కూడా తనదైన శైలిలో ముందుకు పోతున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పరిస్థితిని గమనించిన బీజేపీ రంగంలోకి దిగిందని అంటున్నారు. రేవంత్ తో డీల్ కు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్- టీఆర్ఎస్ పొత్తు ఖాయమైన మరుక్షణమే రేవంత్ రెడ్డి… బీజేపీలో చేరిపోవడం ఖాయమని అంటున్నారు.

ఇవి కూడా చదవండి ..

  1. మందుబాబులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న లిక్కర్ ధరలు
  2. రైతు బంధు జమ ఆ రోజు నుంచే! వడ్లు కొననే కొనడట..
  3. డీఎస్ కాంగ్రెస్ లో చేరికకు బ్రేక్! అసలేం జరిగిందో?
  4. ఫిబ్రవరిలో రోజుకు 14 లక్షల కేసులట! భారత్ లో ఒమిక్రాన్ విలయమేనా?

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.