క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్, వివేకానంద నగర్ V TEAM ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేష్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెయినుద్దీన్ ఆధ్వర్యంలో మస్తాన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు అంకమ రావు, ఆది నారాయణ, సతీష్ రెడ్డి, సత్యనారాయణ, భాను, అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కనకయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ పాల్గొన్నారు.
Less than a minute