Andhra PradeshHyderabadNationalRangareddyTelangana

కేసీఆర్ సార్ కు 18 మార్కులే.. కారుకు మూడో స్థానమే! తాజా సర్వే సంచలనం..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువున్నా…. అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారనే ప్రచారంతో.. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే ఉద్దేశ్యంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణ జనాల్లో కేసీఆర్ పై వ్యతిరేకత భారీగా పెరిగిందనే చర్చ సాగుతోంది. నిజానికి కొంత కాలంగా కేసీఆర్ పాలనపై జనాల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. హుజురాబాద్ ఫలితం తర్వాత అది మరింతగా పెరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, కేసీఆర్ పాలనపై జనాలు ఏమంటున్నారు, ముందస్తు ఎన్నికలు వస్తాయా.. వస్తే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది.. కేటీఆర్ ను సీఎంగా జనాలు కోరుకుంటున్నారా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జనాలు ఏ పార్టీని కోరుకుంటారు అన్న అంశాలపై వోటా సంస్థ సర్వే నిర్వహించింది.

1 vota - Crime Mirror

సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ ఆధ్వర్యంలోని వోటా( వాయిస్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రా) సంస్థ సమగ్ర సర్వే నిర్వహించింది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేండ్లు పూర్తైన సందర్భంగా ఈ సర్వే నిర్వహించింది వోటా సంస్థ. డిసెంబర్ 1 నుంచి 10 వరకు పది రోజుల పాటు వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించింది. ఎక్కువగా ఆన్ లైన్ ద్వారా శాంపిల్స్ సేకరించింది వోటా సంస్థ. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, టెలిగ్రామ్, యూ ట్యూబ్ ఆన్ లైన వేదికగా ద్వారా జరిగిన సర్వేలో వేలాది మంది పాల్గొని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వోటా సంస్థ సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర కోపంగా ఉన్నారనే విషయం వోటా సర్వేలో స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని, ఏకంగా మూడో స్థానానికి పడిపోతుందని వోటా సర్వేలో తేలింది. అంతేకాదు టీఆర్ఎస్ లో అసమ్మతి ఖాయమని కూడా మెజార్టీ ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

3 vota - Crime Mirror

కేసీఆర్ ఏడేళ్ల పాలన ఎలా ఉందని ప్రశ్నించగా.. కేసీఆర్ కు దిమ్మతిరిగే ఫలితం వచ్చింది. కేసీఆర్ పాలనకు కేవలం 18 మార్కులే వచ్చాయి. కేసీఆర్ పాలన అసల్లు బాగాలేదని ఏకంగా 50.8 శాతం మంది, బాగా లేదని 20.3 శాతం మంది తీర్పు ఇచ్చారు. 10.9 శాతం మంది కేసీఆర్ పాలన పర్వాలేదన్నారు. ఏకంగా 71 శాతం మంది కేసీఆర్ పాలన బాగా లేదని చెప్పడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

5 vota - Crime Mirror

సీఎం కేసీఆర్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారని ప్రశ్నించగా… కేసీఆర్ పాలనకు కేవలం 25 మార్కులే ఎక్కువ మంది వేశారు. 67.1 శాతం మంది కేసీఆర్ పాలన అట్టర్ ప్లాప్ అంటూ 25 మార్కులు వేశారు. 11.7 శాతం మంది 50 మార్కులు వేయగా.. 7.3 శాతం మంది మాత్రమే 75 మార్కులు వేశారు. 13.9 శాతం మంది మాత్రం కేసీఆర్ పాలనకు ఫుల్ 100 మార్కులు వేశారు.

8 vota - Crime Mirror

టీఆర్ఎస్ లో అసమ్మతి ఉందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ఏకంగా 70 శాతానికి పైగా ఉందని చెప్పారు. 14 శాతం మంది అసమ్మతి గురించి ఏమి తెలియదని చెప్పగా.. 7 శాతం మంది మాత్రమే గులాబీ పార్టీలో అసమ్మతి లేదని చెప్పారు. 70 శాతానికి పైగా జనాలు కారు పార్టీలో అసమ్మతి ఉందని భావించడం షాకింగే. ఇక దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా అంటే దాదాపు 73 శాతం మంది ఇవ్వరనే చెప్పారు. అంటే కేసీఆర్ హామీలపై జనాలకు పూర్తిగా నమ్మకం పోయిందని తెలుస్తోంది.

10 vota - Crime Mirror

కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండటంతో.. టీఆర్ఎస్ ను ఎవరూ ఓడిస్తారని ప్రశ్నించగా ఆసక్తికరమైన ఫలితం వచ్చింది. కారు పార్టీకి ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ వైపు మెజార్టీ జనాలు మొగ్గు చూపారు. బీజేపీ పార్టీకి 48.5 శాతం ఓటర్లు జై కొట్టగా.. కాంగ్రెస్ కు మద్దతుగా 27. 1 శాతం మంది నిలిచారు. టీఆర్ఎస్ ను ఎవరూ ఓడించలేరని 18 శాతం మంది తమ అభిప్రాయం చెప్పారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారన్న ప్రశ్నకు కూడా గమ్మత్తైన ఫలితం వచ్చింది. బీజేపీకి 38.4 శాతం , కాంగ్రెస్ కు 37 శాతం మంది ఓటేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం దారుణంగా మూడో స్థానానికి పడిపోయింది. ముందస్తు ఎన్నికలు వస్తే గులాబీ పార్టీకి ఓటేస్తామని కేవలం 22.2 శాతం మంది మాత్రమే ఓటేస్తారని చెప్పారు. టీఆర్ఎస్ కు ఎవరూ ఓడిస్తారన్న ప్రశ్నకు బీజేపీకి ఎక్కువ సపోర్ట్ రాగా.. ఎవరికి ఓటు వేస్తారు అన్న ప్రశ్నకు మాత్రం కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా నిలవడం ఆసక్తి రేపుతోంది.

Bjp Etela :  ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్? ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా బహిర్గతం.. – Crime Mirror

టీఆర్ఎస్ కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. కేటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారంపై అభిప్రాయం చెప్పాలని కోరగా.. 28 శాతం మంది సరైంది కాదన్నారు. 15.4 శాతం మంది సరైనదని చెప్పారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఇంకా టైముందని 17 శాతం మంది చెప్పగా.. దాదాపు 40 శాతం మంది మాత్రం ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.

టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రిగా ఎవరూ బెస్ట్ ఆప్షన్ అన్న ప్రశ్నకు మాత్రం కేసీఆర్ కే ఎక్కువ మంది జై కొట్టారు. కేసీఆరే సీఎంగా బెటరని 45 శాతం మంది చెప్పగా… రెండో స్థానంలో అనూహ్యంగా హరీష్ రావు నిలిచారు. హరీష్ రావుకు 42.5 శాతం మంది ఓటేయగా.. కేటీఆర్ కు కేవలం 10 శాతం మంది మాత్రమే సపోర్ట్ చేశారు. కవిత బెస్ట్ సీఎం ఆప్షన్ అని కేవలం 1.7 శాతం మంది మాత్రమే తమ అభిప్రాయం చెప్పారు.

13 vota - Crime Mirror

ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్ గ్రాఫ్ తగ్గిందని 72 శాతం మంది చెప్పగా.. మారలేదని 22. 8 శాతం మంది, పెరిగిందని 4.8 శాతం మంది తమ అభిప్రాయాన్ని సర్వేలో వెల్లడించారు. టీఆర్ఎస్ లో చీలక వస్తుందా? అని ప్రశ్నించగా.. 45.3 శాతం మంది వస్తుందని, 43 శాతం మంది రాదని చెప్పారు.

Read More : అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ కేటీఆర్ కు కమీషన్లు? – Crime Mirror

మొత్తంగా వోటా సంస్థ సర్వే ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని స్పష్టమవుతోంది. కేసీఆర్ పాలనపై జనాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చిని కారు పార్టీకి ఘోర పరాజయం తప్పదని తెలుస్తోంది. గులాబీ పార్టీ ఏకంగా మూడో స్థానానికి పడిపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం ఎవరన్న దానిపై మాత్రం ఆసక్తికర ఫలితం రావడం ఆసక్తిగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య స్వల్ప తేడాను ఉంది.

ఇవి కూడా చదవండి ..

  1. ప్రధానికి తప్పని సైబర్ క్రైమ్ సెగ.. నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్
  2. పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన ఐదుగురు.. పొద్దు పోవడం లేదంట..
  3. ఇదేమి అరాచకం… ఓమహిళా ఉద్యోగిని ప్రైవసీ దెబ్బ తీస్తారా?
  4. దేశంలో భయపెడుతున్న ఒమిక్రాన్.. రాత్రి కర్ఫ్యూ దిశగా పలు రాష్ట్రాలు..

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.