Andhra PradeshTelangana

అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ కేటీఆర్ కు కమీషన్లు?

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ కాక రేపుతున్నారు. ఇటీవలే వందల కోట్ల భూ కుంభకోణంలో కేటీఆర్ కీలకంగా ఉన్నారని ఆరోపించారు తాజాగా మరో బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి. అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కలిసి కేటీఆర్ వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు.

రేకులు, ఇనుముతో కట్టిన నిర్మాణానికి 177 కోట్లకు పెంచారన్నారు రేవంత్ రెడ్డి.  60 కోట్లతో మొదలైన స్థూపం.. రూ.180 కోట్లకు  పెంచారన్నారు. కేటీఆర్ ను మెప్పించి కాంట్రాక్టర్  వ్యయం పెంచుకున్నాడన్నారు. 300 శాతం బడ్జెట్ పెంచారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే అమరుల  స్థూపం నిర్మాణం ఆంధ్రావాళ్లకు ఇచ్చారన్నారు. ఈ టెండర్ కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ కు ఇచ్చిందన్నారు. ఈ కంపెనీ  పొద్దుటూరుకు చెందిన వ్యక్తిదేదన్నారు. 6 శాతం కన్సల్టెంట్ ఫీజు ఇస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ఆంధ్రా కాంట్రాక్టర్ కు ఇవ్వడానికి కారణం ఏంటి? తెలియాలన్నారు. ఈ అవినీతికి  కేటీఆర్, అతని  ఫ్రెండ్ తెలుకుంట శ్రీధరే కారణమన్నారు రేవంత్ రెడ్డి.

Social Media : ఇదేమి అరాచకం… ఓమహిళా ఉద్యోగిని ప్రైవసీ దెబ్బ తీస్తారా? 

అమరుల స్థూపం కట్టడానికి తెలంగాణ వాళ్లుపనికి రారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అమరుల స్థూపం కట్టడానికి కూడా పొద్దుటూరు వాళ్లకు కాంట్రాక్ట్  ఇచ్చారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ కు ఇచ్చి అమరుల గుండెల్లో గుణపాలు దించారన్నారు.  అయినా అధికార పార్టీ ధనదాహం తీరడం లేదన్నారు. అమరుల స్థూపం దుస్థితి చూస్తే బాధేస్తుందన్నారు. అసలు కేసీఆర్ తెలంగాణ బిడ్డేనా? డీఎన్ఏ టెస్టు చేయించాలన్నారు. నాలుగేళ్లైనా అమరుల స్థూపం ఎందుకు పూర్తికాలేదో విచారణ కమిటీ వేయాలన్నారు.  కమిటీ వేసి ఆలస్యానికి కారకులైన వారిపై   క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.

ఇవి కూడా చదవండి..

  1. పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన ఐదుగురు.. పొద్దు పోవడం లేదంట..
  2. దేశంలో భయపెడుతున్న ఒమిక్రాన్.. రాత్రి కర్ఫ్యూ దిశగా పలు రాష్ట్రాలు..
  3. ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్? ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా బహిర్గతం..
  4. బిపిన్ రావత్ పై కుట్ర జరిగిందా? హెలికాప్టర్ ఎలా కూలింది!

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.