Telangana

తీన్మార్ మల్లన్న పోటీ అక్కడి నుంచే? బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్..

మల్లన్న ఎంట్రీతో కారు, కాంగ్రెస్ పార్టీల్లో గుబులు..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్. తెలంగాణ రాజకీయాల్లో ఆయనో సంచలనం. కొన్ని రోజులుగా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబంపై పోరాటం చేస్తున్నారు మల్లన్న. తన క్యూ న్యూస్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రశ్నించే గొంతుకగా తీన్మార్ మల్లన్న నిలవడంతో తెలంగాణ జనాల్లో ఆయన క్రేజీ రోజురోజుకు పెరిగిపోయింది. కేసీఆర్ కు కంట్లో నలుసులా తీన్మార్ మల్లన్న మారిపోయాడని భావిస్తున్న సమయంలోనే.. జ్యోతిష్యుడు మారుతీ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు ఆగష్టు 27, 2021న తీన్మార్​ మల్లన్న ను అరెస్ట్ చేశారు. తర్వాత అతనిపై 37 కేసులు నమోదు చేశారు. చివరికి న్యాయ పోరాటంతో 107 రోజుల తర్వాత చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు తీన్మార్ మల్లన్న.

Read More : బియ్యం స్మగ్లింగ్ స్కాంలో కేటీఆర్? బీజేపీ పక్కాగా స్కెచ్ వేస్తోందా?

తీన్మార్ మల్లన్న అరెస్టు కాక ముందే రాష్ట్ర వ్యాప్తంగా తనకుంటూ ఓ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. మల్లన్న టీమ్ లో భారీగా యువకులు చేరారు. అన్ని జిల్లాల్లోనూ మల్లన్న కమిటీ ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు తీన్మార్ మల్లన్న సిద్ధమయ్యారు. 2021 ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి రెండు సంవత్సరాల ప్రజల్లోనే ఉంటానని 2021, జూలై 18న ఘటకేసర్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రకటించాడు. దీంతో తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన అరెస్టుతో సీన్ మారిపోయింది. తీన్మార్ మల్లన్న జైలులో ఉన్న సమయంలోనే ఆయన సతీమణి ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. అక్రమ కేసులతో తన భర్తను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే మల్లన్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని ఆయన భార్య ప్రకటించారు.

వారానికి నాలుగున్నర రోజులే పని.. – Crime Mirror

జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నమంగళవారం అధికారికంగా బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర నేతల సమక్షంలో తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పుకున్నారు. మల్లన్నకు తరుణ్ చుగ్ సభ్యత్వ రసీదు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన తర్వాత సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లన్న. ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్ అన్నారు. ఆయన భరతం పట్టడమే తన లక్ష్యమని చెప్పారు.

కేసీఆర్ పై పోరాటమే లక్ష్యమంటున్న మల్లన్న.. బీజేపీలో తర్వాత కార్యాచరణ ఏంటీ అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది చర్చగా మారింది. అయితే తీన్మార్ మల్లన్న సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధాపురం గ్రామం. ఇది భువనగిరి నియోజకవర్గం పరిధిలో ఉంది. దీంతో ఆయన భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. భువనగిరి అసెంబ్లీ సీటుపై బీజేపీ హైకమాండ్ కూడా తీన్మార్ మల్లన్నకు హామీ ఇచ్చిందని తెలుస్తోంది. భువనగిరి నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి రెడ్లే గెలుస్తూ వస్తున్నారు. బహుజన వాదంతో జనాల్లో చోటు సంపాదించిన తీన్మార్ మల్లన్న.. పోటీ చేస్తే భువనగిరిలో గెలుపు ఖాయమని బీజేపీ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు.

తన మాట వినకపోతే చీరేస్తా.. ఎంపీడీవోకు అధికార పార్టీ నేత వార్నింగ్.. – Crime Mirror

తీన్మార్ మల్లన్న పోటీ విషయంలో నల్గొండ జిల్లా నేతలకు కూడా బీజేపీ పెద్దలు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తే.. ఆ ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంటుందని బీజేపీ లీడర్లు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ బలంగా ఉన్న నల్గొండ జిల్లాలో తీన్మార్ మల్లన్న చేరికతో తమకు బలం భారీగా పెరిగిందని జిల్లా కమలం నేతలు చెబుతున్నారు. గత మార్చిలో జరిగిన నల్గొండ – ఖమ్మం – వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీకి చుక్కలు చూపించారు తీన్మార్ మల్లన్న. దాదాపుగా గెలిచినంత పని చేసి.. స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నల్గొండ జిల్లా పరిధిలో మల్లన్నకు భారీ ఆధిక్యత వచ్చిందని అంచనా వేశారు. ఖమ్మంలో వెనకబడటం వల్లే ఓడిపోయారని నిపుణులు కూడా విశ్లేషించారు. మొత్తంగా తీన్మార్ మల్లన్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి ..

  1. బీజేపీలోకి తీన్మార్ మల్లన్న.. కేసీఆర్ కు ఇక దేత్తడేనా?
  2. ఒమిక్రాన్ పంజా పిల్లలపైనేనా? సౌతాఫ్రికాలో మూడు రోజుల్లో కేసులు డబుల్..
  3. భువనేశ్వరి కాళ్లను కన్నీళ్లతో కడుగుతానన్న వైసీపీ ఎమ్మెల్యే
  4. కొబ్బరికాయ దెబ్బకు పగిలిన రోడ్డు.. కాంట్రాక్టరుపై ఎమ్మెల్యే ఫైర్

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.