Telangana

కాంగ్రెస్ గూటికి జిట్టా బాలకృష్ణ రెడ్డి?

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డితో జిట్టా మంతనాలు

తెలంగాణ ఉద్యమ నాయకుడు, యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్ రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం. టీఆరెస్ ను గద్దె దించాలంటే రేవంత్ కోటరీలో జాయిన్ కావాలని భావిస్తున్న జిట్టా.. తన యువ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని చెబుతున్నారు.

జిట్టా బాలకృష్ణ రెడ్డి ఇటీవలే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారని తెలుస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఆయన కలిశారని చెబుతున్నారు. భువనగిరి అసెంబ్లీ టికెట్ కావాలని జిట్టా కోరగా… పీసీసీ పెద్దల నుంచి సానుకూల సంకేతం వచ్చిందంటున్నారు. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో జిట్టా బాలకృష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. త్వరలోనే తన అనుచరులతో సమావేశమై అధికారికంగా ప్రకటన చేస్తారని అంటున్నారు. త్వరలో కాంగ్రెస్ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

జిట్టా బాలకృష్ణా రెడ్డి గతంలో టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశారు. టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. అయితే భువనగిరి టికెట్ ను తనకు ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బయటికి వచ్చారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాకా ఆ పార్టీలో చేరారు. కొంత కాలానికే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. వరుసగా మూడు ఎన్నికల్లోనూ భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యువ తెలంగాణ పార్టీని స్థాపించారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.