MedchalRangareddyTelanganaVikarabad

ముంచుకొస్తున్న కరోన మూడో దశ

  • విద్యా సంస్థలు అప్రమత్తంగా ఉండాలి
  • అధికారులకు ఆదేశాలిచ్చిన విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం (క్రైమ్ మిర్రర్) : విద్యా సంస్థల్లో ఎవరికి వారు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా మూడో దశ ముప్పు తలెత్తే అవకాశాలున్నాయన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో మంత్రి తన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లోని విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, చేతులు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Read More : రేవంత్ రెడ్డితో ఈటల రాజేందర్ రహస్య డీల్?

రాష్ట్రంలో కొన్ని విద్యా సంస్థల్లో కరోనా కేసులు వెలుగుచూస్తున్నా, వెంటనే ఆయా విద్యా సంస్థల్లోని విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో పని చేస్తున్న ప్రతీ ఒక్కరూ రెండు డోసులు వేసుకునే విధంగా ఆయా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కరోనా తగ్గిందని భావించి కరోనా నిబంధనలను పాటించడంలో యాజమాన్యాలు, విద్యార్థులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న సమాచారం ఉందని, అలాంటి పరిస్థితులు పునారావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Ravi Anchor : తెలంగాణ వాడనే రవిని ఎలిమినేట్ చేశారా! బిగ్ బాస్ పై రచ్చ రచ్చ…

కరోనా నిబంధనలను పాటించే విధంగా అవసరమైన సానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్ మిషన్లను విద్యా సంస్థలు తప్పనిసరిగా వినియోగించేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కరోనా కేసులు నిలకడగా ఉన్నా, మూడో దశ ముప్పు ఉందన్న నేపథ్యంలో అన్ని స్థాయిల విద్యా సంస్థల్లో అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టేందుకు తగిన ఆదేశాలను జారీ చేయాలని మంత్రి సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్వియ జాగ్రత్తలు తీసుకునేలా విద్యార్థులను అప్రమత్తం చేయాలని సూచించారు. విద్యా శాఖాధికారులు, ఆయా యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు సమన్వయంతో కరోనా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు దేవసేన, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి ..

  1. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి
  2. శివశంకర్ మరణం సీనీ పరిశ్రమకు తీరని లోటు
  3. హాజీపూర్ లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
  4. కట్టుకున్నవాడే కలయముడై.. కరెంటు వైర్ తో భార్యను చంపేసాడు

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.