Andhra PradeshNationalTelangana

ట్రాఫిక్ పోలీసుల వసూళ్ల దందా.. స్టింగ్ ఆపరేషన్ తో పట్టేసిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యేకు జనాల నుంచి ప్రశంసల జల్లు

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : ప్రజా సమస్యల కంటే సొంత వ్యాపారాలపైనే ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు ఫోకస్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచేంత వరకు ఓటర్లకు దండాలు పెట్టి… గెలిచాకా పట్టించుకోవడం మానేశారనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. కాని ఈ ఎమ్మెల్యే మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ప్రజా సమస్యలపై బాగా స్పందిస్తుంటారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రక్కుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇటీవల ఆయన దృష్టికి వచ్చాయి. కొందరు ట్రక్కు డ్రైవర్లు పోలీసుల అక్రమాలపై ఎమ్మెల్యేను కలిసి వివరించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో అక్రమ వసూళ్ల సంగతి చూడాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. ఇందుకోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. అర్ధరాత్రి పూట స్టింగ్ ఆపరేషన చేశారు.

Etela Rajendar : మునుగోడు గడ్డపై గర్జించిన ఈటల.. పోటీ ఖాయమేనా?

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని కన్నడ్ చాలీస్‌గ్రామం ఘాట్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రక్కుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విషయం బీజేపీ ఎమ్మెల్యే మంగేష్ చహ్వాణ్‌కు తెలియడంతో.. ఆయన ఈ ఆరోపణల్లోని నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వైరల్ గా మారింది.

Read More : టిఫిన్ కోసం వెళుతూ సాగర్లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు స్నేహితులు సేఫ్

ఈ స్ట్రింగ్ ఆపరేషన్‌ వీడియోలో.. ముందుగా ఎమ్మెల్యే కొందరు డ్రైవర్లతో మాట్లాడటం కనిపిస్తుంది. వారు ఎమ్మెల్యేతో.. తమ దగ్గర నుంచి ట్రాఫిక్ పోలీసులు అక్రమంగా రూ. 500 నుంచి రూ. 2000 వరకూ వసూలు చేస్తున్నారని తెలిపారు. వీరి మాటలు విన్న ఎమ్మెల్యే ఒక ట్రక్కు ఎక్కి డ్రైవర్ సీటులో కూర్చుని చెక్‌పోస్టు వరకూ వచ్చారు. అక్కడున్న ఒక కానిస్టేబుల్.. ఎమ్మెల్యే ఎక్కిన ట్రక్కును ఆపాడు. కిందకు దిగి రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఎమ్మెల్యే తన దగ్గర రూ. 300 మాత్రమే ఉన్నాయని వాటిని ఇస్తానన్నారు. దీంతో ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఇంతలో మరోకానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. అతను ఎమ్మల్యేను దుర్బాషలాడాడు. దీంతో ఎమ్మెల్యే వాహనం నుంచి దిగారు. అతనిని గుర్తించిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పారిపోయారు.

Komatireddy : రేవంత్, కోమటిరెడ్డి ఏకమయ్యారు.. ఇక కేసీఆర్ ఖేల్ కతమైనట్టేనా?

ఎమ్మెల్యే స్టింగ్ ఆపరేషన్ సమాచారం అందుకున్న ఔరంగాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లందరినీ విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగేష్ మాట్లాడుతూ తాను అక్రమాలకు పాల్పడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లను స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నానని, ఇక్కడి అధికార ఫ్రభుత్వంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎంతటి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఇప్పుడు బయటపడిందన్నారు. ఎమ్మెల్యే మంగేష్ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యేపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. హాట్సాప్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. పాలనలో జగన్ అట్టర్‌ ఫ్లాప్‌… ఉండవల్లి షాకింగ్ కామెంట్స్
  2. కేసీఆర్ కు సినిమా చూపిస్తున్న ఈటల.. సర్దార్ తో కరీంనగర్ లో సవాల్..
  3. మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్న ఎస్ఐ.. దుమ్ము దులిపిన భర్త
  4. రేవంత్, కోమటిరెడ్డి ఏకమయ్యారు.. ఇక కేసీఆర్ ఖేల్ కతమైనట్టేనా?

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.