Andhra PradeshTelangana

రాజ్యాంగ దినోత్సవానికి సీఎం డుమ్మా.. గవర్నర్ తో కేసీఆర్ కయ్యమా!

తెలంగాణలో సంచలనం జరగబోతోందా?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. 72వ రాజ్యాంగ దినోత్సత వేడుకను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. రాజ్ భవన్ లో గవర్నర్ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పాల్గొన్నారు. కాని సీఎం కేసీఆర్‌ మాత్రం డుమ్మా కొట్టారు. అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ దినోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

కేసీఆర్ కు సినిమా చూపిస్తున్న ఈటల.. సర్దార్ తో కరీంనగర్ లో సవాల్..

రాజ్ భవన్ లో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నట్లు సీఎంవో నుంచి రాజ్ భవన్ వర్గాలకు ముందు సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాట్లు కూడా చేశారు. కాని చివరి నిమిషంలో కేసీఆర్ రావడం లేదని రాజ్ భవన్ కు సీఎంవో సమాచారం ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి లేకుండానే గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి కేసీఆర్ రాకపోవడంపై రాజ్ భవన్ తో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజ్యాంగ దినోత్సవానికి సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదన్న దానిపై రకరకలా చర్చలు సాగుతున్నాయి.

మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్న ఎస్ఐ.. దుమ్ము దులిపిన భర్త

కొంత కాలంగా గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో నరసింహన్ గవర్నర్ కు ఉన్నప్పుడు తరుచూ రాజ్ భవన్ వెళ్లేవారు కేసీఆర్. వారం వారం వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. పండుగలు, ముఖ్యమైన రోజులు ఏమొచ్చినా రాజ్ భవన్ వెళ్లి నరసింహన్ కు కేసీఆర్ విషెస్ చెప్పేవారు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ను ఆహ్వానించేవారు. అయితే తమిళి సై గవర్నర్ గా వచ్చిన కొన్ని రోజులకే సీన్ మారిపోయింది. రాజ్ భవన్ వైపే వెళ్లడం లేదు కేసీఆర్. పండుగల సమయంలోనూ ఆమెకు విషెస్ చెప్పడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదు. అంతేందుకు మహాత్మ గాంధీ జయంతి రోజున ప్రతి ఏటా బాపుఘాట్ లో గవర్నర్ తో కలిసి సీఎం నివాళి అర్పిస్తారు. కాని ఈసారి గాంధీ జయంతి రోజున బాపుఘాట్ వెళ్లలేదు కేసీఆర్. గవర్నర్ తో విభేదాల కారణంగానే ఆయన గాంధీకి నివాళి అర్పించేందుకు వెళ్లలేదనే ప్రచారం జరిగింది.

అన్నపూర్ణ స్టూడియోస్ కు సమంత …

మరోవైపు గవర్నర్ తమిళి సై కూడా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పలు సార్లు ప్రకటనలు చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసింది. యూనివర్శిటీ వీసీల నియామకంలోనూ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించి.. కేసీఆర్ సర్కార్ వార్నింగ్ సిగ్నల్ పంపించిందనే చర్చ ఉంది. పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసినా.. గవర్నర్ తమిళి సై ఆమోదించ లేదు. రెండు నెలల పాటు ఆ పైల్ ను పెండింగులో పెట్టారు. అయినా గవర్నర్ ను వెళ్లి కలవలేదు కేసీఆర్. చివరకు పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపించారు. గవర్నర్ ను కలవడం ఇష్టం లేకే ఎమ్మెల్సీ విషయంలో కేసీఆర్ ను ఆమెతో సమావేశం కాలేదని అంటారు. తాజాగా రాజ్యాంగ దినోత్సవానికి హాజరుకాకపోవడంతో.. గవర్నర్ తో కలిసి వేదిక పంచుకోవడం కేసీఆర్ కు ఇష్టం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి …

  1. రోజుకు రూ. 5 కోట్ల నష్టం.. హైదరాబాద్ మెట్రో మూతపడనుందా?
  2. డేంజర్ జోన్ లో ప్రియాంక .. సిరి ??
  3. గాయపడిన సీపీఐ నారాయణ.. వైసీపీ ఎంపీ చికిత్స
  4. 13 మంది సర్పంచుల రిజైన్.. సొంత జిల్లాలో సీఎంకు బిగ్ షాక్

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.