Telangana

ఢిల్లీలో కేసీఆర్ హ్యాండ్సప్.. ఉత్త చేతులతో రిటర్న్

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :  అంతన్నాడు. ఇంతన్నాడు.. తాడేపేడో తేల్చుకుంటానన్నాడు.. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో యుద్ధం చేస్తానంటూ ఢిల్లీ ఫ్లైటెక్కారు.. సీన్ కట్ చేస్తే నాలుగు రోజులు మకాం వేసి.. ఎవరినీ కలవకుండానే ఉత్త చేపులతో ఊపుకుంటా తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. ఇంతకూ ఆయన హస్తన వెళ్లిందేందుకు.. పోరాటం చేయలేదెందుకు. .నాలుగు రోజులు సైలెంటుగాన్ ఎందుకు ఉన్నట్లు.. ఇదో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

Read More : మూడు లీటర్ల పెట్రోల్ కు కిలో టమోట.. తగ్గేదేలే..

యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు, జల వివాదం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీతో తాడో పేడో తెల్చుకుంటానంటూ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. తనతో కొందరు మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలను తీసుకెళ్లారు. కాని ఢిల్లీ పర్యటనలో నాలుగు రోజులూ ఇంట్లోనే ఉన్నారు కేసీఆర్. ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి .. బుధవారం తిరిగి బయలుదేరే వరకు ఢిల్లిలోని తన నివాసమైన 23 తుగ్లక్ రోడ్ లోనే ఉన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై అవసరమైతే ప్రధానిని కలుస్తానన్న కేసీఆర్ ఎవరినీ కలవలేదు.

Bigg Boss : డేంజర్ జోన్ లో ప్రియాంక .. సిరి ??

మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖమంత్రి తోమర్ తో కేవలం కేటీఆర్ నేతృత్వంలోని బృందం కలిసింది. వరి ధాన్యం కొనుగోళ్లపై చర్చించింది. అయితే తెలంగాణ బృందానికి కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. అయినా కేసీఆర్ కేంద్ర మంత్రితో సమావేశం కాలేదు. ప్రధాని కార్యాలయం నుంచి ఆయనకు ఎలాంటి పిలుపు రాలేదు. బుధవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీని కలిశారు. మంగళవారం మోడీ అపాయింట్ మెంట్ కోరడంతో పీఎంవో ఆమెకు అపాయింట్ మెంట్ ఇచ్చింది. కానీ నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ ఎందుకు రాలేదన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

Ysrcp Mp : గాయపడిన సీపీఐ నారాయణ.. వైసీపీ ఎంపీ చికిత్స

ప్రధాని మోడీని కేసీఆర్ కలవకపోవడంపై మరో చర్చ కూడా సాగుతోంది. అసలు కేసీఆర్ మోడీ అపాయింట్ మెంట్ అడగలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి ఆరోగ్యం బాగాలేక ఢిల్లిలోని ఎయిమ్స్ లో ఆమె చికిత్స చేయించుకుంటున్నారు. ఆమె చికిత్స కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు తప్ప.. రాష్ట్ర సమస్యలపై కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానని వెళ్లిన కేసీఆర్.. ఎవరినీ కలవకుండా తిరిగి రావడం ఏంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతులపై కేసీఆర్ కు చిత్తశుద్ది లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే గొప్ప గొప్ప ప్రకటనలు చేశారని మండిపడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ఏం సాధించారో చెప్పాలని,యాసంగిలో వరి ధాన్యం కొంటారో లేదో స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. అక్రమ నిర్మాణాలకు నిలయంగా మల్కాజ్ గిరి సర్కిల్
  2. రోడ్డెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇందిరాపార్క్ సాక్షిగా పరువు గోవిందా..
  3. చివరి నిమిషంలో కవిత పేరు.. ఎన్నిక ఏకగ్రీవం కోసమేనా ?!
  4. టమోట ధరలకు రెక్కలు… కిలో కు వంద రూపాయల పైమాటే

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.