Andhra PradeshTelangana

గత 30 ఏండ్లలో అతిపెద్ద వర్షం.. టీటీడీకి కోలుకోలేని నష్టం

రాయలసీమ రతనాల సీమ గతం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : రాయలసీమలో వరద బీభత్సం కొనసాగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తాయి. వరదలతో రాయలసీమ అల్లాడిపోయింది. తిరుపతిలోనూ గతంలో ఎప్పుడు లేనంతగా వరద బీభత్సం కనిపించింది. గత 30 సంవత్సరాల్లో ఇంత భారీ వర్షం కురవలేదని టీటీడీ అధికారులు అంచనా వేశారు. వర్షాలు, వరదలతో టీటీడీకి గతంలో ఎప్పుడు లేనంతగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.

Read More: తేరా చిన్నపురెడ్డికి షాక్.. ఎమ్మెల్సీగా సింగర్ సాయిచంద్..

భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లడంచో.. కపిలతీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోకి వరద ప్రవేశించింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణగోడ దెబ్బతిన్నది. ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి.రెండవ ఘాట్ రోడ్ లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయి. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారు..

Read More : విలపించిన చంద్రబాబు ఇంటికొచ్చాక ఏం జరిగింది? భువనేశ్వరి ఏం చేసింది?

శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బ తిన్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడతో పాటు, రాంనగర్, వినాయక నగర్, జిఎంబి క్వార్టర్స్, శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నాయి.కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతింది.దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారు..

Read More : కేసీఆర్ ను కలిసిన జగన్.. చంద్రబాబుపైనే చర్చా?

వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగింది. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశారు. టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.తిరుమల, తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. ఎన్టీఆర్ పౌరుషం ఏమైంది?.. మిత్రులను వెనకేసుకొస్తున్నారా?
  2. మోడీతో తేల్చుకుంటానంటున్న కేసీఆర్..
  3. జగన్ పార్టీపై నందమూరి ఫ్యామిలీ అటాక్.. తాట తీస్తామని వార్నింగ్..
  4. 83లో లోకేష్ జననం.. 85లో మాధవరెడ్డి టీడీపీ సభ్యత్వం!

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.