Andhra PradeshNationalTelangana

బోరున విలపించిన చంద్రబాబు

అసెంబ్లీలో బాబు ఫ్యామిలీపై వైసీపీ కామెంట్లు

క్రైమ్ మిర్రర్, ఆన్‌లైన్ న్యూస్ డెస్క్: సీఎం అయ్యాకే సభలోకి తిరిగి అడుగుపెడుతానని, అప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యులందరికీ నమస్కరిస్తూ బయటికి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడిగావేడిగా మారాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN), మంత్రులు, వైసీపీ నేతలు అంతా తనను టార్గెట్ చేస్తున్నారంటూ మాజీ సీఎం గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆవేదనకు గురయ్యారు.

ఇకపై సభలోకి అడుపెట్టనంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (chandrababu nayudu) స్పష్టం చేశారు. వైసీపీ నేతల వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రులు (minstes) అంబటి రాంబాబు, కొడాలి నాని, కురసాల కన్నబాబు వంటి నాయకులు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలపై చేశారు.

తనను.. నత కుటుంబాన్ని ఘోరంగా అవమానించారని.. సభలో తన భార్య గురించి మాట్లాడటంపై పార్టీ ఎమ్మెల్యేల భేటీలో తీవ్ర ఎమోషనల్ అయిన బాబు.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆఖరికి తన కుటుంబాన్ని కూడా వదలడం లేదన్నారు. తన భార్య పేరు ప్రస్తావించి విమర్శలు చేయడం ఆవేదన కలిగించింది అన్నారు. అందుకే మళ్లీ సీఎం (cm) అయ్యకే సభకు వస్తాను అంటూ సభలోనే చంద్రబాబు శపథం చేశారు. సభలో జరిగిన పరిణామాలపై ఆవేదనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పుడు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.