

క్రైమ్ మిర్రర్, న్యూస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో చేపట్టిన ఆందోళనలకు మోడీ ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని శుక్రవారం కీలక ప్రకటన చేశారు. జాతినుద్దేశిస్తూ ప్రసంగించిన ప్రధాని.. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. గురునానక్ జయంతి రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన పని చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. మూడు సాగు చట్టాలు రైతుల ప్రయోజనాల కోసమే తీసుకువచ్చామని, అయితే సన్నకారు రైతులకు మెప్పించలేకపోయామని అన్నారు. అందుకే సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి, రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. రైతులు తమ దీక్షలను విరమించి తమ ఇండ్లకు తిరిగి వెళ్లాలని రైతులను ప్రధాని మోడీ కోరారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గతేడాది నవంబరు 26 నుంచి నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఆందోళనలు చేస్తున్న అందరికి తెలిసిందే. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివార్లలో రహదారులను దిగ్బంధం చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులు తమ కుటుంబాలతో పాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- 50 వేల మందిని బలిగొన్న ఉప్పెన.. 44 ఏళ్లు అయినా మానని దివిసీమ గాయం..
- నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూసుకుంట్ల! సీఎం కేసీఆర్ నుంచి సిగ్నల్..
- పెట్రోల్ రేటు రూ.4 తగ్గింది.. ఎక్కడంటే? –
- రేవంత్ రెడ్డిని కడిగిపారేసిన కోమటిరెడ్డి..
2 Comments