Telangana

దళిత బంధుకు బ్రేక్! ధర్నాలతో కేసీఆర్ సైడ్ ట్రాక్ పాలిటిక్స్..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : సహజంగా ఎక్కడైనా అధికార పార్టీ నేతలకు నిరసనలు ఎదురవుతుంటాయి. గ్రామాలకు వెళ్లినప్పుడు తమ సమస్యలపై జనాలు వాళ్లను నిలదీస్తుంటారు. కాని ప్రస్తుతం తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు విపక్ష నేతలు జనాల్లోకి వెళుతుంటే.. అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు. అంతేకాదు అధికార పార్టీనే ఏకంగా బంద్ కు పిలుపిస్తోంది. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తోంది. ముఖ్యమంత్రే స్వయంగా ధర్నాకు దిగుతున్నారు. ఇదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. అధికార టీఆర్ఎస్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో టీఆర్ఎస్ ఎందుకిలా చేస్తుందన్న అనుమానాలు వస్తున్నాయి.

Prabhakar Reddy : నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూసుకుంట్ల! సీఎం కేసీఆర్ నుంచి సిగ్నల్..

కేంద్ర సర్కార్ టార్గెట్ గా టీఆర్ఎస్ నిరసనలు తెలపడం, సీఎం కేసీఆరే స్వయంగా ధర్నా చేయడం, బండి సంజయ్ పై దాడికి యత్నించడం వెనుక గులాబీ పార్టీకి బలమైన వ్యూహమే ఉందంటున్నారు. హుజురాబాద్ ఓటమి తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా, వందల కొట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈటల రాజేందర్ ను ఓడించలేకపోయింది. హుజురాబాద్ ఫలితంతో కేసీఆర్ పై జనాల్లో మరింత వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో నవంబర్ 4 నుంచి దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు కేసీఆర్. ఎన్నికల కోడ్ తో దళిత బంధును ఆపేశారంటూ బీజేపీపై చిందులు తొక్కారు. ఎన్నికలు ముగియగానే దళిత బంధు ఇవ్వకుండా ఎవరూ ఆపుతారో చూస్తానంటూ ప్రకటన చేశారు.

అయితే నవంబర్ రెండో వారం కూడా ముగిసింది. అయినా దళిత బంధు ఊసే ఎత్తడం లేదు కేసీఆర్. ల‌బ్దిదారుల‌కు 10 ల‌క్ష‌ల పంపిణీ జాడే లేదు. దళిత బంధు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. కొత్తగా రుణాలు దొరికే పరిస్థితి కూడా లేదు. దళిత బంధు అమలు చేసే పరిస్థితి లేదు. అందుకే టీఆర్ఎస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. అందులోభాగంగానే వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలంటూ నిరసనలు చేయడం, బీజేపీ నేతలను టార్గెట్ చేయడం జరుగుతుందని అంటున్నారు.హుజురాబాద్ ఓట‌మి, న‌వంబ‌ర్ 4 నుంచి ద‌ళిత‌బంధు అమ‌లు విష‌యం మ‌రుగున ప‌రిచేందుకే.. కేసీఆర్ బీజేపీని రెచ్చ‌గొట్టి ఆ ర‌చ్చ‌లో త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు.

టీఆర్ఎస్ వ్యూహంతో కొన్ని రోజులుగా దళిత బంధు అంశం చర్చకు రాకుండా పోయింది. దళిత బంధుపై కాకుండా ధాన్యం కొనుగోళ్లపై పార్టీల నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. బండి సంజయ్ పై జరిగిన దాడులతో మేటర్ పూర్తిగా సైడ్ ట్రాక్ లో పోయింది. ఇక ఇందిరా పార్క్ లో కేసీఆర్ ధర్నాతో జనాల అటెన్షన్ మొత్తం అటు వైపే మళ్లింది. మొత్తంగా కేసీఆర్ అనుకున్నట్లే దళిత బంధు అంశం మరుగునపడ్డాయనే చర్చ సాగుతోంది. కేసీఆర్ ఎత్తుల్లో భాగంగానే టీఆర్ఎస్ నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారని, నిరసనలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి …

  1. మునుగోడు ఓటర్లకు ఇక పండుగే..! ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా?
  2. బండి సంజయ్‌పై కేసు నమోదు చేసిన నల్లగొండ పోలీసులు
  3. కేసీఆర్ ఛానెల్‌కు ఆంధ్రా సీఈవో.. వాటీస్ దిస్ కొలవర్రీ!
  4. బండా, క‌డియంల‌కు డిప్యూటీ సీఎం? కేబినెట్ నుంచి ఇద్ద‌రు రెడ్లు ఔట్ ?

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.