

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ రాజకీయ భవిష్యత్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవలే జైలు నుంచి విడుదలైన మల్లన్న… తన భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. నిజానికి మల్లన్న జైలులో ఉన్నప్పుడే ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరిగింది. మల్లన్న భార్య పేరుతోనే ఆ ప్రకటన వచ్చింది. అంతేకాదు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు తీన్మార్ మల్లన్న భార్య. తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరిపోయారని అంతా భావించారు.
జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న అధికారికంగా కషాయ కండువా కప్పుకుంటారని అంతా అనుకున్నారు. కాని జైలు నుంచి రిలీజ్ అయి వారాలు గడుస్తున్నా బీజేపీలో చేరలేదు మల్లన్న. తాజాగా వేస్తున్న అడుగులతో ఆయన వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. జైలు నుంచి తనను బయటకు తీసుకురావడానికి బలమైన, బయటి వ్యక్తులతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు తీన్మార్ మల్లన్న. ప్రధానంగా నాలుగు ఆప్షన్లపై అనుచరులతో కసరత్తు చేస్తున్నారు. అందులో ఒకటి కొత్త పార్టీ పెట్టడం. రెండోది ఇతర పార్టీలకు బయట నుంచి మద్దతు ఇవ్వడం. మూడో ఆప్షన్ ఇప్పుడున్న పద్ధతిలోనే కొనసాగడం. మల్లన్న చివరి ఆప్షన్ వేరే పార్టీలో చేరడం. అంటే గతంలో ప్రచారం జరిగినట్లు బీజేపీలో చేరడం.
ఈ నాలుగు ఆప్షన్లలో ఏది బెటరనే దానిపై తీర్మార్ మల్లన్న టీం జిల్లా కన్వీనర్లు, కో-కన్వీనర్లతో అభిప్రాయ సేకరణ చేపడుతోంది. జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టి.. రాష్ట్ర కమిటీలో అందరి అభిప్రాయాలు తీసుకొని.. త్వరలోనే ఓ స్పష్టమైన రాజకీయ నిర్ణయాన్ని తీసుకుంటానని తీర్మార్ మల్లన్న తెలిపారు. మల్లన్న జైల్లో ఉన్నప్పుడు.. తన భర్త బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ ఆయన భార్య కమలం పార్టీ పెద్దలకు లేఖ రాశారు. దీంతో మల్లన్న బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు మళ్లీ భవిష్యత్ కార్యచరణ పేరుతో సమావేశాలు పెడుతుండటం కన్ఫూజన్కు కారణమవుతోంది. మల్లన్న బీజేపీలో చేరడం లేదా? అనే అనుమానం తలెత్తుతోంది.
మరోవైపు మల్లన్నకు సంబంధించి మరో చర్చ కూడా నడుస్తోంది. తాను బీజేపీలో చేరాలని ఇప్పటికే డిసైడ్ కాగా, తన టీం సభ్యుల నుంచి వ్యతిరేకత రాకుండా.. ఇలా అభిప్రాయ సేకరణ చేపడుతున్నారా? అని కూడా అంటున్నారు. చూడాలి మరీ తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయో..
ఇవి కూడా చదవండి …
- వెంకట్రామిరెడ్డి కేసీఆర్ బినామీనా? రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమైందా?
- పార్లమెంట్ కు కవిత.. కేటీఆర్ కు లైన్ క్లియర్! బండాతో కేసీఆర్ ఖతర్నాక్ గేమ్..
- రేషన్ బియ్యంతో నక్సల్స్ ఆచూకీ! గడ్చిరోలిలో పోలీసుల స్పెషల్ ఆపరేషన్
- వైఎస్ వివేకాను ఇంత కిరాతకంగా చంపారా..! డ్రైవర్ దస్తగిరి స్టేట్ మెంట్స్ లో సంచలనాలు..
2 Comments