

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలనం వెలుగు చూసింది. సీబీఐ విచారణలో వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి బాంబ్ పేల్చారు. వివేకా హత్యపై ఆగస్ట్ 30న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సీఆర్పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్మెంట్ రికార్డు చేశారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. అందులో సంచలన విషయాలు ఉన్నాయి.
వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు డ్రైవర్ దస్తగిరి. అందులో బడా నేతల పేర్లు ప్రస్తావించారు దస్తగిరి. కన్ఫెషన్ స్టేట్మెంట్లో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి రగిలిపోయినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్మెంట్లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
వివేకా హత్యకు సంబంధించి డ్రైవర్ దస్తగరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వివరాలు ఇలా ఉన్నాయి..
– 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోయాడు
– ఎన్నికల్లో ఓడిపోవడానికి ఎర్రగంగిరెడ్డి మోసం చేశాడని వివేకా ఆగ్రహించాడు
– బెంగళూరులో స్థలం విషయంలో పంచాయతీ కోసం పలుమార్లు వెళ్లేవారు
– ఆ స్థలంలో వాటా కావాలని ఎర్రగంగిరెడ్డి అడిగితే వివేకా ఆగ్రహించాడు
– 2018లో నేను వివేకా వద్ద డ్రైవర్ పని మానేశాను
– డ్రైవర్ గా మానేసిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ను తరచూ కలిసేవాడిని
– 2019 ఫిబ్రవరి 2న ఎర్రగంగిరెడ్డిన తన ఇంటికి నన్ను, సునీల్ యాదవ్, ఉమశంకర్ రెడ్డిని తీసుకెళ్లాడు
– వివేకాను చంపాలని ఎర్రగంగిరెడ్డి తనకు సూచించాడ. తాను హత్య చేయలేనని చెప్పాను..హత్య చేయడానికి నీవు ఒక్కడివే కాదు… మేము కూడా వస్తామన్నారు.. హత్య వెనక పెద్దల ప్రమేయం ఉందన్నారు
– వై.ఎస్.అవినాష్ రెడ్డి, వై.ఎస్.భాస్కర్ రెడ్డి, వై.ఎస్.మనోహర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారని ఎర్రగంగిరెడ్డి చెప్పారు.. శంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తాడు.. అందులో 5కోట్లు నాకు ఇస్తానని ఎర్రగంగిరెడ్డి చెప్పాడు.
– ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత – సునీల్ యాదవ్ నాకు కోటి రూపాయలు ఇచ్చాడు. అందులో 25 లక్షలు ఇవ్వాలని మరలా ఇస్తానని సునీల్ చెప్పాడు.75 లక్షల రూపాయలను మున్నా అనేవ్యక్తి వద్ద దాచి పెట్టాను.
– ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి వివేకా ఇంటి కుక్కను కారుతో ఢీకొట్టి చంపేశారు.
– నేను కదిరికి వెళ్లి గొడ్డలి కొనుగోలు చేసి సునీల్ యాదవ్ కు ఇచ్చాను
– 2019 మార్చి 14వ తేదీ రాత్రి ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, నేను వివేకా ఇంటికి వెళ్లాం
– వివేకా ఇంటికి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి ముందుగా ఇంట్లోకి వెళ్లాడు..తర్వాత మేము ముగ్గురం గోడ దూకి పక్క తలుపు తీసి లోపలికి వెళ్లాం
– బెంగళూరు స్థలం విషయంలో వాటా కావాలని ఎర్రగంగిరెడ్డి వివేకాను అడిగాడు.ఆ సమయంలో వాదన జరగడంతో సునీల్ యాదవ్ బూతులు తిడుతూ వివేకా ముఖంపై కొట్టాడు. కిందపడిన వివేకాను ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో దాడి చేశాడు
– వివేకాను గొడ్డలితో దాడి చేసి ఆయన చేత్తో ఓ ఉత్తరం రాయించాము.
– సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఆయన ఇంట్లో కొన్ని పత్రాలు తీసుకున్నారు
– బాత్ రూంలోకి తీసుకెళ్లి వివేకాను గొడ్డలితో నరికి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత అంతా గోడదూకి పారిపోయాం. భయపడవద్దు… అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి చూసుకుంటారని ఎర్రగంగిరెడ్డి మాకు ధైర్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి …
- ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ? టీఆర్ఎస్ కు షాక్ తప్పదా..
- ఈటల కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకున్నారా? బీజేపీలో చేరడానికి ఆయనే కారణమా?
- మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు హతం..
- బీజేపీ నేతల బట్టలు ఊడదీసి కొడతామన్న గులాబీ లీడర్..
One Comment