

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మొత్తం 19 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఆరు సీట్లు ఎమ్మెల్యే కోటాలోనివి కాగా… ఒకటి గవర్నర్ కోటా. మిగితా 11 ఎమ్మెల్సీ స్థానాలు స్థానిక సంస్థల కోటాకు చెందినవి. స్థానిక సంస్థల నుంచి పదవి ముగియనున్న 11 మంది ఎమ్మెల్సీల్లో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో కవిత ఎమ్మెల్సీ అయ్యారు. టీఆర్ఎస్ కు రెబెల్ గా మారిన రాజ్యసభ సభ్యుడు డీఎస్ సన్నిహితుడిగా ఉన్నందుకు భూపతిరెడ్డిపై అనర్హతా వేటు వేయించి మరీ ఆ సీటును కవితకు కట్టబెట్టారు
అయితే ఎమ్మెల్సీగా కవిత కేవలం 14 నెలలు మాత్రమే కొనసాగారు. దీంతో కవితను ఎమ్మెల్సీని చేస్తారా? చేయరా? అనేది టీఆర్ఎస్లో కీలక పరిణామాలకు వేదిక కానుంది. ఫుల్ టర్మ్ పదవి అనుభవించని నేతలకు మరోసారి అవకాశం ఇస్తుంటారు. గతంలో చాలా మందికి అలా కేసీఆర్ రెండోసారి అవకాశం ఇచ్చారు. కాని ఇప్పుడు కవిత విషయంలో మాత్రం అలా జరుగుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే తండ్రీ-కూతురుకి, అన్నా-చెల్లికి అసలే మాత్రం సత్సంబంధాలు లేవు. కవితకు ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ కూడా నిషేధించబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడం.. ఇదే టైమ్‌లో కవిత పదవీకాలం కూడా ముగియడం ఆసక్తికరంగా మారింది.
మునుపటిలా పరిస్థితులు ఉండుంటే.. కవితకు ఎమ్మెల్సీ రెన్యూవల్ కన్ఫామ్గా జరిగుండేది. కానీ, ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో కోల్డ్‌వార్ ఓ రేంజ్లో సాగుతోంది. పార్టీలో కవిత జాడే లేకుండాపోయింది. ఇటీవలి టీఆర్ఎస్ ప్లీనరీకి సైతం కవిత డుమ్మా కొట్టి దుబాయ్ డ్రామాతో దాగుడుమూతలు ఆడారు. అన్న కేటీఆర్‌కు రాఖీ కూడా కట్టలేనంత వైరం వారి మధ్య ఏర్పడింది. ప్రగతిభవన్‌లో బతుకమ్మ కూడా ఆడలేనంత దూరం పెరిగిపోయింది. కవితను దాదాపు పక్కనపెట్టేసినట్టే కనిపిస్తోంది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడంలో మనస్పర్థలు, ఆస్థి గొడవలు ఇలా రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నా.. నిజమేంటో వారికే తెలియాలి. ఇలా ఫ్యామిలీ డ్రామా నడుస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం.. కవిత రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసే పరిణామంగా చూస్తున్నారు.
కవితను ఎమ్మెల్సీ చేయాలనుకుంటే.. ఎమ్మెల్యేల కోటాలోనో, స్థానిక సంస్థల ఖాతాలోనో.. గవర్నర్ కోటాలోనో.. ఏదో ఒక విధంగా మండలికి పంపించవచ్చు. బోలెడన్ని ఖాళీలు ఉండటం.. వడ్డించే వాడు తండ్రే కావడంతో.. కవిత ఎమ్మెల్సీ కావడం చాలా ఈజీ. కానీ… ప్రస్తుత పరిస్థితుల్లో కవితను మరోసారి ఎమ్మెల్సీని చేస్తారా? లేదా? అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి …
- ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు! డిక్లేర్ చేసిన విశాఖ నేత..
- తెలంగాణలో మరో ఉప సమరం.. ఆ రెండు స్థానాలకు ఖాయమట!
- ఉద్యమ వీరులకా.. వలస నేతలకా? ఎమ్మెల్సీ సీట్లు దక్కేదెవరికో?
- ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఖరారు…
One Comment