

క్రైమ్ మిర్రర్, పరిగి : అటవీ భూములను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు అందించేందుకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు.పోడు భూముల శాశ్వత పరిష్కారంలో భాగంగా సోమవారం పరిగి మండలం, ఇబ్రహీంపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ…. అడవి భూములలో సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు న్యాయం చేకూరచ్చుటకు, ఇక ముందు అడవి భూములు అక్రమనలకు గురి కాకుండా సంరక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రశ్నించిన జర్నలిస్టులపై బండ బూతులా! కేసీఆర్ కు భయం పట్టుకుందా?
అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకొనుటకు అవసరమైన ఫారాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఫారం నింపరాని వారికి గ్రామ కార్యదర్శులు సహకరించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలతో పాటు ఆధార్ కార్డు, కాస్తు ధృవ పత్రాలు జత చేయాలని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను గ్రామ కమిటీ నిర్ధారించి జిల్లా కమిటీకి పంపడం జరుగుతుందన్నారు. అర్హులైన ఎస్టీ లకు హక్కు పత్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి భూములు ఇతరులకు అమ్ముకొనుటకు వీలు పడదని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, స్పెషల్ ఆఫీసర్ పుష్పలత, గ్రామ సర్పంచ్ నర్సమ్మ, ఎంపీపీ అరవింద్ రావు, తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.