

క్రైమ్ మిర్రర్, తెలంగాణా బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మరోసారి మోసం చేయబోతున్నారా? మూడెకరాల భూ పంపిణి లాగానే దళిత బంధు పథకం నిలిచిపోనుందా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు దళిత బంధుతో హడావుడి చేసిన టీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ముఖ్యమంత్రి కూడా మాట్లాడటం లేదు.
దళిత బంధు పథకం అమలుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడాన్ని, తప్పు పట్టిన ముఖ్యమంత్రి, అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2 ఓట్ల లెక్కింపు అయిపోతే,నవంబర్ 4 నుంచి హుజూరాబాద్ లో పథకం అమలు చేస్తామని మీడియా ముందు చెప్పారు. అదో పెద్ద సమస్యే కాదని అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగాగానే అక్టోబర్ 30 పోలింగ్ జరిగింది. నవంబర్ 2 రిజల్ట్స్ వచ్చేశాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి చెప్పిన నవంబర్ 4 వచ్చింది, వెళ్ళింది. కానీ, ముఖ్యమంత్రి నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ, దళిత బంధు అమలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. ఉలుకూ పలుకూ లేదు… వాలంటీరా.. కామాంధుడా! గ్రామ సచివాలయంలో అఘాయిత్యమా.. crimemirror.com
సీఎం కేసీఆర్ తో పాటు గులాబీ లీడర్లంతా దళిత బంధుపై మౌనంగా ఉండటంతో.. ఆ పథకానికి కాలం తీరినట్టేననే చర్చ సాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమిపై పోస్ట్ మార్టమ్ నిర్వహించారట కేసీఆర్. అందులో దళిత బంధు పథకమే తమకు గండంగా మారిందని తేలిందట. దళిత బంధు పథకంపై ఇతర వర్గాల వాళ్లు గుర్రుగా ఉన్నారని, వాళ్లంతా గంపగుత్తగా ఈటలకు ఓటేశారని పోలింగ్ బూతుల వారీగా నిర్వహించిన సమీక్షలో తేలిందట.
జగదీశ్ రెడ్డి అవుట్.. గుత్తా ఇన్! నల్గొండ టీఆర్ఎస్ లో ముసలమేనా?
వాహనాలను సీజ్ చేసే అధికారం లేదు.. తెలంగాణ పోలీసులకు హైకోర్టు షాక్
కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన హుజురాబాద్ మండలం శాలపల్లిలో బీజేపీకి 119 ఓట్ల లీడ్ వచ్చింది. ఆ గ్రామంలో దళితుల ఓట్లు కారుకు పడగా.. మిగితా వర్గాల్లో దాదాపు 90 శాతం ఓట్లు కమలానికి పడ్డాయట. దీంతో దళిత బంధు పథకంతో తమకు ఇబ్బందులు వస్తాయని గులాబీ లీడర్లు కేసీఆర్ కు చెప్పారని తెలుస్తోంది. అందుకే దళిత బంధుపై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సైలెంట్ అయ్యారని అంటున్నారు. దళిత బంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు.
మరోవైపు హుజూరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని, గెలుపు ఊపులో ఉన్న బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలకు సిద్దమవుతున్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం మీడియా ముందుకు వచ్చేందుకు వెనకాముందు అవుతున్నారు. దీంతో దళిత బందుకు పథకం కూడా .. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాలు, అంబేద్కర్ విగ్రహం జాబితాలో చేరిపోయినట్లేనా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
2 Comments