HyderabadKarimnagarSiddipetTelangana

హుజురాబాద్ లో ఆశలు వదులుకున్న టీఆర్ఎస్!

ఏడో రౌండ్లలోనూ బీజేపీకి లీడ్...

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం పెరుగుతోంది. తొలి రౌండ్ లో 116, రెండో రౌండ్ లో 192 ఓట్ల లీడ్ సాధించిన ఈటల రాజేందర్ కు మూడో రౌండ్ లో 911 పరుగుల భారీ ఆధిక్యత వచ్చింది. దీంతో మూడు రౌండ్లు ముగిసేసరికి ఈటల మెజార్టీ 12 వందల 69కి పెరిగింది. హుజురాబాద్ రూరల్ కౌంటింగ్ ముగియగా.. టౌన్ లెక్కింపు జరుగుతోంది. తాజా ట్రెండ్స్ ను బట్టి హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది.

హుజురాబాద్ మండలంలో తమకు లీడ్ వస్తుందని పోలింగ్ తర్వాత గులాబీ నేతలు  ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లోనూ హుజురాబాద్ మండలంలో గట్టిపోటీ ఉందని తేలింది. అయితే ప్రస్తుతం మాత్రం హుజురాబాద్ లో మంచి మెజార్టీ దిశగానే ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. వీణవంక, ఇల్లంతకుండ, కమలాపూర్ మండలాల్లో బీజేపీకి మంచి లీడ్ రావచ్చని భావిస్తున్నారు. దీంతో హుజురాబాద్ పై టీఆర్ఎస్ ఆశలు వదులుకుందని తెలుస్తోంది.

హుజారాబాద్ ఏడో  రౌండ్

  • టీఆర్ఎస్     3792
  • బీజేపీ           4044
  • కాంగ్రెస్        94
  • ఏడో  రౌండ్ లీడ్  1252 బీజేపీ
  • బీజేపీ మొత్తం లీడ్  3438 ఓట్లు

హుజారాబాద్ ఆరో  రౌండ్

  • టీఆర్ఎస్     3639
  • బీజేపీ           4656
  • కాంగ్రెస్        180
  • ఆరో రౌండ్ లీడ్  1017 బీజేపీ
  • బీజేపీ మొత్తం లీడ్  3186 ఓట్లు

హుజారాబాద్ ఐదో  రౌండ్

  • టీఆర్ఎస్     4041
  • బీజేపీ           4358
  • కాంగ్రెస్        –
  • ఐదో  రౌండ్ లీడ్  344 బీజేపీ
  • బీజేపీ మొత్తం లీడ్  2038 ఓట్లు

హుజారాబాద్ నాలుగో  రౌండ్

  • టీఆర్ఎస్     12252
  • బీజేపీ           13525
  • కాంగ్రెస్        680
  • నాలుగో రౌండ్ లీడ్  1273 బీజేపీ
  • బీజేపీ మొత్తం లీడ్  1695 ఓట్లు

హుజారాబాద్ మూడో రౌండ్

  • టీఆర్ఎస్     4659
  • బీజేపీ          
  • కాంగ్రెస్        220
  • మూడో  రౌండ్ లీడ్  911 బీజేపీ
  • బీజేపీ మొత్తం లీడ్  1269 ఓట్లు

హుజురాబాద్ రెండో రౌండ్

  • టీఆర్ఎస్     4659
  • బీజేపీ           4851
  • కాంగ్రెస్        220
  • రెండో రౌండ్ లీడ్  192  బీజేపీ
  • మొత్తం లీడ్  358  బీజేపీ

హుజురాబాద్ తొలి రౌండ్

  • మొత్తం ఓట్లు   9894
  • టీఆర్ఎస్  4444
  • బీజేపీ      4610
  • కాంగ్రెస్  119
  • తొలి రౌండ్ లీడ్  116 బీజేపీ WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.