Jayashankar BhoopalpallyKarimnagarPeddapalliTelangana

గంజాయి సరఫరా చేసిన అమ్మిన కేసులతో పాటు

పిడి యాక్టు నమోదు చేస్తాం...పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి.

పెద్దపల్లి, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : గంజాయి సరఫరా చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసిపి సారంగపాని హెచ్చరించారు. సోమవారం పెద్దపెల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 10రోజులుగా గంజాయి సరఫరా, విక్రయం సాగుపై డేగకన్ను వేశామన్నారు. ఇప్పటి వరకు డివిజన్ పరిధిలో నాలుగు కేసులు నమోదు చేసి 5కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 28న ఓదెలలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి 750 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.

నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా భూపాలపల్లికి చెందిన మాటురి సాయినిఖిల్, కొత్తగూడెంకు చెందిన నుమావత్ రజినీకాంత్, అన్నారం తండాకు చెందిన భూక్య సాయికుమార్ ల నుండి కొనుగోలు చేస్తున్నారనే సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వద్ద నుండి 1100 గ్రాములు గంజాయిని సీజ్ చేశామన్నారు. పెద్దపల్లి సబ్ డివిజన్లో గంజాయి సరఫరా చేసిన విక్రయించిన కేసులతోపాటు పిడియాక్ట్ నమోదు చేస్తామన్నారు. గంజాయి నిర్మూలన ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ప్రజలు గంజాయి సరఫరా పై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి సరఫరా చేసే వ్యక్తులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న సీఐ ఇంద్రసేన రెడ్డి, ఎస్సైలు లక్ష్మణ్, రాజేష్ లతో పాటు సిబ్బందిని ఏసిపి అభినందించి నగదు రివార్డులను అందజేశారు.

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.