

- కార్యాలయన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం..
- వరంగల్ విజయ గర్జన సభకు తరలిరండి..
క్రైమ్ మిర్రర్, కొడంగల్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పిలుపు మేరకు ఈనెల 15న వరంగల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “విజయ గర్జన” మహాసభ ను పురస్కరించుకొని కొడంగల్ లోని రెడ్డి బసిరెడ్డి ఫంక్షన్ హాల్ నందు పార్టీ కొడంగల్ టీఆరెస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి, మరియు వికారాబాద్ జడ్పీ చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు కొడంగల్ లో కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ ప్రారంభించడానికి వచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే వరంగల్ విజయ గర్జన మహా సభకు పెద్ద ఎత్తున తెరాస నాయకులు పార్టీ కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో 5 మండలాల నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.