HyderabadTelangana

బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ ఇంట్లో గంజాయి.. అన్న కోసం వెళితే అనుకోని విధంగా..!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ గంజాయితో పట్టుబడినట్లు తెలిసింది. ఓ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవటం కోసం వెళితే.. ఊహించని విధంగా షణ్ముక్ గంజాయితో చిక్కినట్లు సమాచారం. షణ్ముక్ అన్న సంపత్ వినయ్‌పై నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్‌కు వెళ్లి పోలీసులు ఇంట్లో తనిఖీలు చేయగా.. అక్కడ గంజాయి, డ్రగ్స్ లభించాయి. దీంతో అన్నదమ్ములిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. షణ్ముక్ అన్న సంపత్ వినయ్‌కు వైజాగ్‌కు చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితం నిశ్చితార్ధం అయింది. సదరు యువతి డాక్టర్ కాగా.. ఆమె తల్లికి క్యాన్సర్ బారిన పడ్డారు. తల్లికి ట్రీట్‌మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది.

Read Also : నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి రాక..

అయితే ఇటీవల మళ్లీ ముహూర్తం కుదుర్చుకోగా.. మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. తనతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆరు రోజుల్లో పెళ్లి ఉందనగా.. మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు హైదరాబాద్‌లోని తమ్ముడు షణ్ముక్ ఫ్లాట్‌లో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు అక్కడకు వెళ్లారు. పోలీసులు షణ్ముక్ ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించగా.. డ్రగ్స్‌తో పాటు గంజాయి పట్టుబడినట్లు తెలిసింది.

Also Read : రేపు మేడారం జాతరకు సిఎం రేవంత్ రెడ్డి రాక..

షణ్ముక్ అన్న సంపత్ వినయ్ వద్ద 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో పాలీసులు సంపత్ వియత్‌తోపాటు షణ్ముక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోనే గంజాయి దొరకటంతో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. నెల క్రితమే షణ్ముక్‌ ఓ హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన యాక్సిడెంట్‌ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఆ సమయంలో అతడు మద్యం సేవించలేదని తేలటంతో లక్కీగా తప్పించుకున్నాడు. డ్రగ్స్, గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు ఉక్కుపాదం మోపుతుండగా.. షణ్ముక్ ఇంట్లో గంజాయి దొరకటం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ కేసు గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : 

  1. భారీ ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ సన్నాహాలు.. నీటి పోరు యాత్ర పేరుతో త్వరలో ప్రజాల్లోకి..!
  2. హారన్ కొట్టినందుకు.. ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదిన ప్రయాణికులు
  3. మోడీని ఇక్కడ తిడతారు.. అక్కడ కాళ్లు పట్టుకుంటారు.. బీఆర్‌ఎస్‌పై కోమటిరెడ్డి ఫైర్
  4. 18 ఏళ్ల తరువాత దుబాయ్ జైలు నుంచి విముక్తి.. కన్నీళ్లతో సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.