

అధికార టిఆర్ఎస్ కు రాజీనామా
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ
త్వరలోనే అధికారికంగా చేరుతానని వెల్లడి.
వనపర్తి ప్రతినిధి క్రైమ్ మిర్రర్ : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ టిఆర్ఎస్ నేత అభిలాష రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం చెల్లె పాడు గ్రామానికి చెందిన అభిలాష రావు తన చదువు పూర్తి కాగానే అమెరికాలో ఉద్యోగం చేస్తూ వచ్చాడు. ఎన్నారైగా ఉన్న అభిలాష రావు తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నారై ఫోరం యువజన అధ్యక్షునిగా పని చేశారు.
పార్టీకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందాడు. 2018 సంవత్సరంలో వనపర్తికి చేరుకొని నియోజకవర్గంలో ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కార్యక్రమాలను రూపొందిస్తూ, ప్రజలలోకి ఆయన సేవలను తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎన్నికలలో నిరంజన్ రెడ్డి గెలుపొందిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలలో నూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలను రూపొందించడం, వారి గెలుపు కోసం తన వంతు కృషి చేశాడు.
ఈ క్రమంలో తన దృష్టిని తన సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్ వైపు సారించి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం నిర్వహిస్తూ వచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్న పట్టుకుని ఇప్పటికే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒకే పార్టీలో ఉంటూ నువ్వా నేనా అన్నట్టు గా కొనసాగుతున్నారు. మరోవైపు అభిలాష రావు సైతం కార్యక్రమాలను నిర్వహిస్తున్నడం వల్ల పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయానికి గురయ్యారు. అధికార పార్టీలో ఉన్న అనైక్యత, అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం, వచ్చే ఎన్నికల నాటికి అధికార పార్టీ నుండి తనకు పోటీ చేసే అవకాశం లభించక పోవచ్చు అన్న ఉద్దేశంతో అభిలాష రావు ఈనెల 6న అధికార పార్టీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు శుక్రవారం తన అనుచరులతో కలిసి హైదరాబాద్ కు చేరుకొని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కొల్లాపూర్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తదితర అంశాలను గురించి అభిలాష రావు రేవంత్ రెడ్డి వివరించారు. భేటీ అనంతరం త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతానని అభిలాష రావు తెలిపారు.