HyderabadRangareddyTelangana

బైకుతో సహా నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి..

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : వనస్థలిపురం సమీపంలోని చింతల్‌కుంటలో శుక్రవారం రాత్రి నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. మహేశ్వరం మండలం మంకాల్‌ గ్రామానికి చెందిన పి.జగదీష్‌ (45) భారీ వర్షంలో బైకుపై వనస్థలిపురం నుంచి ఎల్‌బీనగర్‌ వైపు బయలుదేరాడు.

చింతల్‌కుంట వద్దకు రాగానే బైకుతో సహా నాలాలో పడి కొట్టుకుపోయాడు. పోలీసులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. డ్రైనేజీ నుంచి వాహనాన్ని బయటకు తీశారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో జగదీష్‌ ఆచూకీ లభించింది. నాలాలో పడిపోగానే తాడు దొరకడంతో దాని సాయంతో జగదీష్‌ బయటపడ్డాడు. అనంతరం ఆయన కర్మన్‌ఘాట్‌ లోని తన సోదరుడి నివాసానికి వెళ్లాడు. ఈ విషయాన్ని జగదీష్‌ సోదరుడు వెల్లడించారు.

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.