

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్: మంథని మండలం ఎక్లాస్పూర్ శివారులో బస్సు బోల్తా పడింది. మంథని నుండి హన్మకొండకి వెళ్తున్న పరకాల డిపో బస్సు కారును ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లగా.. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ చనిపోయాడు. మరో 16 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి మరణించగా, బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతిచెందిన వ్యక్తిని ఖాన్సాయిపేటకు చెందిన వినీత్గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.