HyderabadRangareddyTelangana

మున్సిప‌ల్ ఆఫీసా? ప్రైవేటు కంపెనీనా?

తుర్క‌యంజాల్ మున్సిపాలిటీలో అస్త‌వ్య‌స్థంగా పాల‌న‌
టౌన్‌ప్లానింగ్ సీట్లో కూర్చుని ప్రైవేటు ప్లాన‌ర్ హ‌ల్‌చ‌ల్‌
అపాయింట్‌మెంట్ ఆర్డ‌ర్లు లేకుండానే విధులు నిర్వ‌హ‌ణ‌
త‌మ‌కు సంబంధంలేదంటున్న చైర్ ప‌ర్స‌న్‌, క‌మిష‌న‌ర్‌

క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి నిఘా ప్రతినిధి: తుర్క‌యంజాల్ మున్సిపాలిటీలో పాల‌న తాడుబొంగ‌రం లేకుండా త‌యారైంది. ఎవ‌రు ఏ విధులు నిర్వ‌హిస్తున్నారో, నియామ‌కాలు ఎలా జ‌రుగుతున్నాయో చైర్ ప‌ర్స‌న్‌కి, క‌మిష‌న‌ర్‌కే తెలియ‌క‌పోవ‌డం ఇక్క‌డ వింత‌. మున్సిపాలిటీ ప‌రిధిలో ఓ ఉద్యోగిని నియ‌మించుకోవాలంటే కౌన్సిల్ తీర్మానమై, క‌మిష‌న‌ర్ అనుమ‌తి పొంది, క‌లెక్ట‌ర్ నుంచి ఆర్డ‌రు కాపీ రావాల్సి ఉండ‌గా… ఇవేవీ లేకుండానే ఓ వ్య‌క్తి య‌థేచ్ఛ‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. మున్సిపాలిటీకి గుండెకాయలాంటి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ ప్రైవేటు ప్లాన‌ర్‌ విధులు నిర్వ‌హిస్తుండ‌టం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఎవ‌రి నుంచి ఎలాంటి అపాయింట్‌మెంట్ ఆర్డ‌ర్ లేకుండా… ఓ ప్ర‌భుత్వ ఆఫీసులో, అదీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ద‌ర్జాగా కూర్చుని ప‌నులు చ‌క్క‌బెడుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశం.

వివ‌రాలు ఇలా ఉన్నాయి… తుర్క‌యంజాల్‌కు ఇన్‌చార్జ్ టీపీవోగా బాధ్య‌త‌లు తీసుకున్న అలీ పాషా త‌న‌కు మ్యాన్ ప‌వ‌ర్ అవ‌స‌ర‌ముంద‌ని లెట‌ర్ పెట్టుకున్నారు. ఇదే అదునుగా భావించిన ఇంజాపూర్‌కు చెందిన ఓ కౌన్సిల‌ర్ త‌న ప‌ర‌ప‌తిని ఉప‌యోగించుకుని, త‌న బినామీ అయిన ఓ ప్లాన‌ర్‌ను హుటాహుటిన టౌన్‌ప్లానింగ్ విభాగంలో అపాయింట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనికి అటు చైర్ ప‌ర్స‌న్ అనుమ‌తి కానీ, ఇటు క‌మిష‌న‌ర్ అనుమ‌తి కానీ తీసుకోక‌పోవ‌డం విశేషం. నాలుగు రోజులుగా ఆ ప్లాన‌ర్ మున్సిపాలిటీ ఆఫీసులోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వ‌హిస్తున్నారు. ఓ ప్రైవేటు ప్లాన‌ర్‌కు ప్ర‌భుత్వ ఆఫీస‌రైన టీపీవో త‌న కీ, పాస్ వ‌ర్డ్‌ను ఎలా ఇస్తార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. టీపీవోకు భారీగా ముడుపులు ఆశ‌చూపి ఈ ప్లాన‌ర్ అపాయింట్ అయ్యార‌న్న విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

yamjal ward office - Crime Mirror

ఇక టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వ‌ర్తిస్తున్న స‌ద‌రు ప్లాన‌ర్‌… గ‌తంలో ఇంజాపూర్ ప్రాంతంలో క‌న్జ‌ర్వేష‌న్ జోన్‌లో ఇళ్ల నిర్మాణాల‌కు అనుమ‌తులు ఇప్పించి విమ‌ర్శ‌ల‌కు గురై ఇప్ప‌టికీ అంద‌రి నోళ్ల‌లో నానుతూనే ఉన్నారు. గ‌త క‌మిష‌న‌ర్ల‌ను, టీపీవోల‌ను ఆమ్యామ్యాల‌కు లొంగ‌దీసుకుని క‌న్జ‌ర్వేష‌న్‌లో జోన్ల‌లో అనుమ‌తులిప్పించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రెండు నెల‌ల క్రితం ష‌ఫీ ఉల్లా క‌మిష‌న‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో ఈ ప్లాన‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ జోన్‌లోని ఫైల్స్‌ను క్లియ‌ర్ చేయాల‌ని ఒత్తిడి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే దానికి ఒప్పుకోని ష‌ఫీ ఉల్లా వాటిని రిజ‌క్ట్ చేశార‌ని, అప్పుడు రిజ‌క్ట్ అయిన ఫైళ్లు ఈ నాలుగు రోజుల్లో క్లియ‌ర్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించినట్లు తెలుస్తోంది. టీపీవో కీ, పాస్ వ‌ర్డ్ … ఈ ప్లాన‌ర్ చేతుల్లోనే ఉండ‌టంతో వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని టాక్ విన‌బ‌డుతోంది.

అయితే… మున్సిపాలిటీలో ఇంత జ‌రుగుతున్నా అటు చైర్ ప‌ర్స‌న్‌కు గానీ, ఇటు క‌మిష‌న‌ర్‌కు గానీ వివ‌రాలు తెలియ‌క‌పోవ‌డం శోచ‌నీయం. అస‌లు టౌన్ ప్లానింగ్ విభాగంలో మ్యాన్ ప‌వ‌ర్ అవ‌స‌ర‌ముంద‌ని త‌న‌కు తెలియ‌ద‌ని, అపాయింటైన విష‌యం అస‌లే తెలియ‌ద‌ని చైర్ ప‌ర్స‌న్ చెప్ప‌డం,. త‌న‌కు స‌హాయంగా ఉండేందుకు ఇద్ద‌రిని కేటాయించాల‌ని త‌న‌కు టీపీవో లెట‌ర్ పెట్టుకున్నార‌ని, విధుల్లో చేర్చుకున్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని క‌మిష‌న‌ర్ దేవేంద‌ర్‌రెడ్డి చెబుతుండ‌టం విశేషం.

చైర్ ప‌ర్స‌న్ అనురాధ రాంరెడ్డి పాల‌న‌లో విఫ‌ల‌య్యార‌ని, అడ్మినిస్ట్రేష‌న్ విష‌యంలో దారుణంగా త‌డ‌బ‌డుతున్నార‌న్న వ్యాఖ్య‌లు విన‌బ‌డుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో న‌చ్చిన వ్య‌క్తిని నియ‌మించుకుని ఓ కౌన్సిల‌ర్ త‌న‌ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్నారంటే… చైర్ ప‌ర్స‌న్ నుంచి పాల‌న ఏవిధంగా చేజారిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇటు ఇన్‌చార్జ్ క‌మిష‌న‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న దేవేంద‌ర్‌రెడ్డి కూడా ఈ మున్సిపాలిటీ త‌న‌కు ప‌ట్ట‌దు అన్న‌ట్టు ఉన్నార‌ని, అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీడీవో ఆఫీసులోనే ఉంటుండంతో ఇక్క‌డ జ‌రుగుతున్న వ్య‌వ‌హారాలు తెలుసుకోలేక‌పోతున్నారంటున్నారు.

ప్రైవేటు వ్య‌క్తికి ప్ర‌భుత్వ‌ టౌన్ ప్లానింగ్ వ్య‌వ‌స్థ కీ, పాస్ వ‌ర్డ్ అప్ప‌జెప్పిన టీపీవో అలీపై క‌లెక్ట‌ర్ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేక చొర‌వ తీసుకుని, చైర్ ప‌ర్స‌న్‌, క‌మిష‌న‌ర్‌తో మాట్లాడి తుర్క‌యంజాల్‌లో ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.