

నాంపల్లి, క్రైమ్ మిర్రర్ : మండల కేంద్రంలోనీ మండల ప్రజా పరిషత్ కార్యలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో భాగంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపిపి ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో శేష్ కుమార్, మండల తాసిల్దార్ లాల్ బహుదూర్ శాస్త్రి, ఏపిఎంయు యాదయ్య, మేళ్ళవాయి ఎంపీటీసీ వంశీ, చిట్టెం పహాడ్ సర్పంచ్ చందు యాదవ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జి ఇందిర, మండలంలోని పలు గ్రామాల విబికే సంతోష, శ్యామల, పరాన, అలివేలు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళా సంఘాల సభ్యులు ఆడపడుచులు లక్ష్మి, సుజాత, యాదమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.