

మాతృమూర్తిపై మానవత్వాన్ని మరచిపోయి
తల్లిని హతమార్చిన మానవ మృగం
క్రైమ్ మిర్రర్ వికారాబాద్: సృష్టికి మూలం అమ్మ… నవమాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మ… బిడ్డ ఆకలితో ఉంటే తన ఆకలిని మర్చిపోయి కడుపు నింపే మాతృమూర్తి… బిడ్డకు ఏ ఆపద వచ్చినా అక్కున చేర్చుకుని గుండెలకు హత్తుకుని కొండంత ధైర్యం ఇచ్చేది అమ్మ… ఇలా అమ్మ ప్రేమను ఎంత వర్ణించినా తక్కువేనని చెప్పవచ్చు.
కానీ,.. ఓ ప్రబుద్ధుడు తన కన్నతల్లి అని కూడా చూడకుండా ఆ మాతృమూర్తిపై మానవత్వాన్ని మరిచిపోయి మట్టుబెట్టిన హృదయవిదారకమైన ఘటన వికారాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పరిగి మండలం ఖుదావాన్పూర్కు చెందిన భీమమ్మను (62) తన కుమారుడు బలవంత్ దారుణంగా హత్య చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు బలవంత్ ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తల్లి భీమమ్మ ను పింఛన్ డబ్బులు ఇవ్వనందుకే విద్యుత్ వైరు తో గొంతు నులిమి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.