

మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు
భయాందోళనలో స్థానికులు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: పెద్దఅంబర్ పెట్ మున్సిపాలిటీ పరిధిలోని స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హఠాత్తుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భయాందోళనకు గురైన ప్రజలు పోలీసులకుజ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అయితే గోదాంలోని వెళ్లే విధంగా అవకాశం లేకపోవడంతో జేసీబీలతో గోడలు కూల్చివేత ప్రారంభించారు. గోదాంలో ఎలాంటి సరుకులు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు గోదాంలో కుర్కురే గోదాంగా స్థానికులు తెలుపుతున్నారు. అయితే మంటల్లో నుండి పెద్ద శబ్దాలు వస్తుండటంతో ఇంకేమైనా కెమికల్ లాంటి పదార్థాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.