

క్రైమ్ మిర్రర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో కొన్ని రోజుల నుంచి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కాగా ఈ రెండు రోజుల వ్యవధిలో కుక్కల దాటికి గ్రామానికి చెందిన ఆకుతోట వెంకటరాజం అనే రైతు దుక్కిటెద్దు మరణించగా 50 వేల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో గ్రామంలోని ప్రజలంతా భయబ్రాంతులకు గురి అవుతున్నారని వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలను చేపట్టాలని స్థానికుడు రేళ్ల నరేష్ కోరుతున్నాడు.