

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది అపోలో ఆస్పత్రి. సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, గాయాలు కీలక ప్రాంతాల్లో తగలేకపోవడంతో ఏ అవయవం కూడా దెబ్బ తినలేదని వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మిగతా మెడికల్ అప్డేట్ ను రేపు వెల్లదిస్తామని చెప్పారు.
శుక్రవారం రాత్రి బైక్పై ప్రయాణిస్తున్న క్రమంలో కేబుల్ బ్రిడ్జి దగ్గర కిందపడి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ముందుగా ప్రాథమిక చికిత్స కోసం మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇందులో సాయిధరమ్ తేజ్ కలెక్టర్గా కనిపించనున్నారు.